మీ క్రియేటివికో దణ్ణం.. వెబ్‌సైట్‌కి నాని చురక

మీ క్రియేటివికో దణ్ణం.. వెబ్‌సైట్‌కి నాని చురక

రెండ్రోజుల క్రితం నాని కారుకి యాక్సిడెంట్‌ అయిన సంగతి తెలిసిందే. డ్రైవర్‌ నిద్రమత్తులో జోగి కారుని కరెంట్‌ పోల్‌కి ఢీకొనడం వల్ల ప్రమాదం సంభవించింది. లక్కీగా ఆ ఇన్సిడెంట్‌లో నానికి గానీ, డ్రైవర్‌కి గానీ పెద్ద ప్రమాదం జరగలేదు.

ప్రస్తుతం ఆ డ్రైవర్‌ని యాక్సిడెంట్‌ కేస్‌ నుంచి రక్షించే పనిలో నాని వుంటే, ఒక ప్రముఖ వెబ్‌సైట్‌ అసలు ఆ యాక్సిడెంట్‌ నాని డ్రైవర్‌ చేయలేదని, నాని చేసాడని, సినీ ఫక్కీలో డ్రైవర్‌పై ఆ నేరం మోపారని వార్త ప్రచురించింది.

ఇలాంటి వార్తల వల్ల ఎలాంటి ప్రమాదం వుంటుందో నానికి తెలుసు కనుక వెంటనే దానిపై స్పందించాడు. పద్ధెనిమిది గంటల పాటు నిరాటంకంగా పని చేసిన డ్రైవర్‌ చేసిన మానవ తప్పిదం నుంచి అతడిని కాపాడడం ఎలా అంటూ తమ కుటుంబం ప్రయాస పడుతోంటే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారంటూ నాని సరాసరి ఆ వెబ్‌సైట్‌ హ్యాండిల్‌కే రిప్లయ్‌ ఇచ్చాడు.

అంతే కాకుండా 'మీ క్రియేటివిటీకో దణ్ణం' అంటూ చురక కూడా వేసాడు. నాని స్థాయి హీరో అంత సర్కాస్టిక్‌గా రెస్పాండ్‌ అవడంతో సదరు వెబ్‌సైట్‌పై ఫాన్స్‌ ఎటాక్‌ చేస్తున్నారు. ఎప్పుడూ అలర్ట్‌గా వుండే ట్రోల్స్‌ కూడా ఆ వెబ్‌సైట్‌ని టార్గెట్‌ చేస్తూ తమదైన శైలి దాడి మొదలు పెట్టారు. గతంలో మాదిరిగా గాలి వార్తలని ప్రచారం చేసే రోజులు కావివి. సోషల్‌ మీడియా ద్వారా సెలబ్రిటీలు నిత్యం అందుబాటులో వుండడంతో ఇలాంటి వార్తలకి వెంటనే చెక్‌ పడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English