ఆ సీనేంటో మాకు తెలుసులే బాసూ

ఆ సీనేంటో మాకు తెలుసులే బాసూ

ఓ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇవ్వడం సహజమే. సినిమా రిలీజ్ కి ముందు అఫీషియల్ గా కొన్ని డీటైల్స్ వస్తే.. మరికొన్ని అనఫీషియల్ గా లీకుల రూపంలో వివరాలు బైటకు వస్తాయి. రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు విషయంలో ప్రచారం కొత్తగా ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది.

రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఓ మాట చెప్పేందుకు తెగ ఉత్సాహం చూపించాడు. ఇప్పటివరకూ మాస్ మహరాజ్ చేయని ఓ అద్భుతమైన సీన్ చేశాడని.. రవితేజ అంటే తెగ జెలసీ వచ్చేసిందని చోటా చెబితే.. చెప్పద్దు అంటూ రవితేజ వారించాడు. ఇంతకీ ఆ సీన్ ఏంటా అనే ఆసక్తి జనాల్లో మొదలైపోయింది. ఈ సినిమాలో ఓ సుదీర్ఘమైన లిప్ లాక్ సన్నివేశం ఉంటుందని ఆల్రెడీ ఓ పాట ద్వారా హింట్ ఇచ్చేశారు. ఈ సీన్ పర్ఫెక్షన్ కోసం పలు మార్లు రీటేక్స్ కూడా చేశారట. ఏ సీన్ పిక్చరైజేషన్ అయినా.. మొదటగా క్లోజప్ లోంచి చూసే వ్యక్తి కెమేరా పర్సనే కదా. అందుకే అలా ఆ పాట గురించి.. ముద్దు గురించి చెప్పేందుకు చోటా ఉత్సాహం చూపించాడని అంటున్నారు.

మరి ఈ లిప్ లాక్ నిజంగా ఉందో లేదో.. ఉంటే ఎంత సుదీర్ఘంగా ఉంటుందో అనే విషయం చెప్పలేం కానీ.. ఈ లిప్ లాక్ ఉన్నట్లు ఆల్రెడీ గతంలో రిలీజ్ చేసిన ఒక పాటలో మనోళ్ళు విజువల్ రిలీజ్ చేశారు కాబట్టి.. చోట క్రియేట్ చేద్దాం అనుకున్న సస్పెన్స్ అక్కడ వర్కవుట్ కాలేదు. అందుకే జనాలందరూ ఆ సీన్ మాకు తెలుసులే బాసూ అంటున్నారు. కాకపోతే ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి అసలు కంటెంట్ కంటే.. రాశి ఖన్నా వేసిన బికినీ.. ఆమె పెట్టిన లిప్ లాక్ ను ఇలా వాడుకోవడం కాస్త టూమచ్చే!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు