శృతికి అంత అవసరం ఏమొచ్చింది?

శృతికి అంత అవసరం ఏమొచ్చింది?

శృతి హాసన్ కు టాలీవుడ్ లోనే కాదు.. దేశమంతటా క్రేజ్ ఉంది. ఆరంభంలో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈ భామకు.. గబ్బర్ సింగ్ మూవీతో పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించింది. ఒకే ఏడాది మూడు భాషల్లో వంద కోట్ల నెట్ వసూళ్లను సాధించిన సినిమాల్లో నటించిన సుందరిగా అరుదైన రికార్డు కూడా సృష్టించింది శృతి.

అమ్మడు చూపించిన జోరు.. కమల్ హాసన్ కూతురు అయినా ఎక్స్ పోజింగ్ కు వెనుకాడని తత్వం.. యూత్ లో ఉన్న క్రేజ్ పుణ్యమా అని అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడేవి. అయితే ఇప్పుడిదంతా గతమే. ప్రస్తుతం శృతి పరిస్థితి ఏమంత గొప్పగా లేదు సరి కదా.. చివరకు ఫిజిక్ పై కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో శృతి హాసన్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఒకటి హాట్ టాపిక్ అవుతోంది. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ.. రిలాక్స్ అవుతున్నట్లు చెప్పింది శృతి హాసన్.

ఈ జనరేషన్ లో ఇదేమీ వింత కాదు కానీ.. ఎప్పుడూ స్విమ్మింగ్ పూల్ పిక్స్ వంటివి షేర్ చేయదు శృతి. కానీ ఇప్పుడు తను కూడా అవన్నీ షేర్ చేస్తోంది. దిశా పటాని.. ఇలియానా.. త్రిదా చౌదరి.. సీరత్ కపూర్ వంటి భామలు.. స్విమ్మింగ్ పూల్స్- బీచెస్ దగ్గర దిగిన బికినీ ఫోటోలు షేర్ చేసి క్రేజ్ పెంచుకుంటారు. కాని ప్రస్తుతం అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చిన శృతి.. తను కూడా ఆ రూట్ లోకే వచ్చిందని సినీజనాలు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు