భాగమతి వసూళ్లలో యూఎస్ భగభగలు

భాగమతి వసూళ్లలో యూఎస్ భగభగలు

బాహుబలి2 తర్వాత వచ్చిన అనుష్క మూవీ భాగమతికి ఆడియన్స్ నుంచి సూపర్బ్ స్పందన వస్తోంది. ఆరంభం కంటే అంతకంతకూ వసూళ్లు పెరుగుతున్నాయని ట్రేడ్ జనాలు చెబుతున్నారంటే.. ఈ సినిమా స్పీడ్ అర్ధమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా భాగమతి బాగా పెర్ఫామ్ చేస్తోంది.

నిజానికి ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రం ఆశించిన మేరకు పెర్ఫామ్ చేయలేదు. కానీ ప్రీమియర్స్ ద్వారా వచ్చిన టాక్ మాత్రం.. సినిమాకు బాగా హెల్ప్ అయింది. ప్రీమియర్స్ ప్లస మొదటి రోజు వసూళ్లు కలిపి.. తొలిరోజున 2.79 లక్షల డాలర్లను ఆర్జించిన భాగమతి.. రెండో రోజున 2.63 లక్షల డాలర్లు గడించింది. ఆది వారంనాడు 1.6 లక్షల డాలర్లు వసూళ్లు కావడంతో.. సినిమా స్పీడ్ ఏ మాత్రం నెమ్మదించలేదని అర్ధమవుతుంది. ఇప్పటివరకూ కేవలం యూఎస్ మార్కెట్ నుంచే 7 లక్షల డాలర్లకు పైగా వసూలు కాగా.. ఈ సినిమా అతి త్వరలోనే 1 మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సాధ్యమైతే మాత్రం అనుష్క కొత్త రికార్డు సృష్టించినట్లే.

ఫిమేల్ సెంట్రిక్ మూవీతో మిలియన్ డాలర్లు సాధించిన హిస్టరీ ఆమె సొంతం అవుతుంది. అంతే కాదు.. అనుష్క కెరీర్ లో లీడ్ రోల్ తో మిలియన్ డాలర్లను గడించిన మొదటి సినిమాగా భాగమతి రికార్డుల్లోకి ఎక్కేస్తుంది. రెండో వీకెండ్ నాటికి భాగమతికి ఈ రికార్డు సొంతం కావచ్చనే అంచనాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English