అనసూయ కామెంట్.. మంచు విష్ణు పరాచికాలు

అనసూయ కామెంట్.. మంచు విష్ణు పరాచికాలు

గతంలో మంచు ఫ్యామిలీ ప్రొడక్షన్లో వచ్చిన ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాకు సంబంధించి తిరుపతిలో జరిగిన ఓ వేడుకలో యాంకర్ అనసూయను మంచు మనోజ్ ఆటాడుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు మనోజ్ అన్నయ్య విష్ణు అనసూయను కాపాడే ప్రయత్నం చేశాడు. ఐతే ఇప్పుడు ‘గాయత్రి’ ఆడియో వేడుకలో అనసూయను కౌంటర్ చేసే బాధ్యత విష్ణు తీసుకున్నాడు.

‘గాయత్రి’ సినిమాలో తన పాత్ర గురించి.. మంచు ఫ్యామిలీతో తన అనుబంధం గురించి అనసూయ మాట్లాడుతూ.. ‘‘నేను మంచు ఫ్యామిలీకి ఒకప్పుడు ఆస్థాన యాంకర్ లాగా ఉండేదాన్ని. మనోజ్ సినిమా ‘మిస్టర్ నూకయ్య’కు నేను యాంకరింగ్ చేసిన విషయం తనకు గుర్తుందో లేదో. అప్పుడే నేను యాంకర్‌గా బేబీ స్టెప్స్ వేశాను. ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేదాన్ని’’ అంటూ అనసూయ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా.. విష్ణు కింది నుంచి లేచి పరుగెత్తుకుని అనసూయ దగ్గరికొచ్చాడు.

మైక్ తీసుకుని ‘మిస్టర్ నూకయ్య’ టైంకి నువ్వు చిన్న పిల్లవా అంటూ గట్టిగా నవ్వాడు. ఐతే అనసూయ తన ఉద్దేశం వేరని అంది. తాను బేబీ అనలేదని.. బేబీ స్టెప్స్ వేస్తున్నానని అన్నానని చెప్పింది. ఆ తర్వాత విష్ణు మాట్లాడుతున్నపుడు మా నాన్నగారిని నువ్వు ‘బావ గారూ’ అన్నావు కదూ అని అనసూయను ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. ఐతే తాను ‘బాబు గారూ’ అన్నానని.. ‘బావ గారూ’ అనలేదని అనసూయ క్లారిటీ ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు