ఎక్స్‌ లవర్‌కి నయన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ఎక్స్‌ లవర్‌కి నయన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

శింబు, నయనతార గురించి తెలియని సినీ ప్రియులు ఉండరు. హీరో హీరోయిన్లు ప్రేమలో పడితే ఎంత దూరం వెళతారు, ఏమేం చేస్తారనేది వీరిద్దరూ ఫోటోల సాక్షిగా ప్రపంచం ముందు పెట్టారు. ఇద్దరూ విడిపోయిన తర్వాత ఏడేళ్ల పాటు మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ ఇంత కాలానికి శింబు, నయనతార కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. దర్శకుడు పాండిరాజ్‌ వీరిద్దరితో సినిమా చేయడం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. శింబు ఓకే అన్నా కానీ నయనతార మాత్రం ఇంతకాలం నో చెబుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఆమె కూడా పచ్చ జెండా ఊపిందని, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ మొదలవుతుందని పాండిరాజ్‌ మీడియాకి చెప్పాడు. శింబుతో విడిపోయిన తర్వాత నయనతార తన కంటే వయసులో బాగా పెద్దవాడైన ప్రభుదేవా ప్రేమలో పడింది. ఆ ప్రేమ కూడా పెళ్లి వరకు వెళ్లి పెటాకులు అయింది. తర్వాత మళ్లీ వచ్చి సినిమాలు చేసుకుంటున్న నయనతారకి మరోసారి అదృష్టం కలిసి వచ్చింది. తమిళంలో వరుసగా రెండు ఘన విజయాలు దక్కడంతో ఆమెకోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ సినిమాతో మళ్లీ శింబు, నయన్‌ దగ్గరవుతారో లేక ప్యూర్‌ ప్రొఫెషనల్స్‌లా తమ పని తాము చూసుకుని సినిమా పూర్తి చేస్తారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు