పరిణీతి చోప్రా ఫొటో వైరల్.. ఎందుకు?

పరిణీతి చోప్రా ఫొటో వైరల్.. ఎందుకు?

హీరోయిన్లు అందాల ప్రదర్శన చేసిన ఫొటోలు మాత్రమే కాదు.. గ్లామర్‌తో సంబంధం లేని ఫొటోలు కూడా అప్పుడప్పుడూ వైరల్ అవుతుంటాయి. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా లేటెస్ట్ ఫొటో కూడా అలాగే వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పరిణీతి గ్లామర్ షో ఏమీ చేయలేదు. అయినప్పటికీ ఈ ఫొటో చర్చనీయాంశమైంది. ఇందుకు ఆమె నడుం మీద కనిపిస్తున్న స్ట్రెచ్ మార్క్సే కారణం.

కెరీర్ ఆరంభంలో పరిణీతి ఎంత బొద్దుగా ఉండేదో తెలిసిందే. సినిమాల్లోకి రాకముందే మరింత లావుగా ఉన్న ఆమె.. కొంచెం బరువు తగ్గి తెరంగేట్రం చేసింది. అయినప్పటికీ బాలీవుడ్ ప్రమాణాలకు తగ్గ ఫిజిక్‌తో కనిపించలేదన్న విమర్శలు ఎదుర్కొంది. ఐతే తర్వాత ఆమె బాగా బరువు తగ్గి నాజూగ్గా తయారైంది. ఒక్కసారిగా అంత బరువు కోల్పోయేసరికి.. నడుం మీద స్ట్రెచ్ మార్క్స్ పడ్డాయి.

మామూలుగా అమ్మాయిలు ఈ స్ట్రెచ్ మార్క్స్ బయటకు కనిపించకుండా చూసుకోవాలని కోరుకుంటారు. ఐతే పరిణీతి అలా ఆలోచించలేదు. అవి కనిపించే లాగే డ్రెస్ వేసుకుంది. అది చూసి పరిణీతి గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు జనాలు. ఇన్‌స్టా‌గ్రాంలో ఈ ఫొటోకు 4 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. ఇంతకుముందు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కరీనా కపూర్ కూడా ఇలాగే స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ఫొటో పెడితే.. దానిపై జనాలు పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారు. కానీ పరిణీతి విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించడం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు