'శీలవతి' షకీలా సెకండ్ ఇన్నింగ్స్

'శీలవతి' షకీలా సెకండ్ ఇన్నింగ్స్

కొన్నేళ్ల క్రితం బి గ్రేడ్ సినిమాలతో చాలా పాపులర్ అయిన షకీలా గురించి కుర్ర కారుకి బాగా తెలిసే ఉంటుంది. అప్పట్లో మలయాళంలో ఆమె చేసిన సినిమాలకు మార్కెట్ చాలానే ఉండేది. ఎంత పెద్ద స్టార్ సినిమా వచ్చినా అందరు షకీలా సినిమా కోసం వెళ్లేవారు. తన అందంతో అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకు కూడా షకీలా భయాన్ని పుట్టించింది. అయితే తరచు ఆమె మార్కెట్ పడిపోతూ వచ్చింది.

ఇక కొన్నేళ్ల క్రితం కొన్ని కామెడీ సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు దక్కలేదు. అయితే చాలా రోజుల తరువాత షకీలా మళ్లీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమైంది. అయితే ఆ సినిమా ఆమెకు 250వ చిత్రం కావడం విశేషం. కేరళలో జరిగిన ఒక యదార్ధ ఘటన ఆధారంగా ఆ సినిమా ఉంటుందని దర్శకుడు సాయిరాం దాసరి చెబుతున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోయే శీలవతి అనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం రీసెంట్ గా రిలీజ్ చేసింది. మన స్టార్లు ఇక్కడ 25వ సినిమా.. 100వ సినిమా.. 150వ సినిమా అంటుంటే.. షకీలా కూడా అదే పందాలో వెళ్ళి 250 నాట్ ఔట్ అంటోంది. ఈవిడ చేసిన సినిమాలను ఇప్పుడు కౌంటింగ్ కూడా చేసే అభిమానులు ఉన్నారో లేదో తెలియదు కాని.. 250 సినిమాలంటే మాత్రం కాస్త విడ్డూరంగానే ఉంది.

మరి షకీలా సెకండ్ ఇన్నింగ్స్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  కాకపోతే 'శీలవతి' టైటిల్ చూస్తుంటే.. ఇది మరో బి-గ్రేడ్ సినిమానా లేకపోతే మామూలు సినిమానా అనే సందేహం కూడా రాకమానదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు