అక్కినేని అభిమానుల మధ్య అంతర్యుద్ధం

అక్కినేని అభిమానుల మధ్య అంతర్యుద్ధం

ఇంతకాలం ఎలాంటి గ్రూపు వివాదాలు లేని అక్కినేని అభిమానుల మధ్య చీలిక వచ్చింది. అక్కినేని నాగార్జున కొడుకుల విషయంలో అంతరం చూపిస్తున్నాడనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఇంతకాలం ఒక్కటిగా కలిసి వున్న అభిమానులు ఇప్పుడు రెండు గ్రూపులుగా విడిపడి ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు.

అఖిల్‌, నాగార్జునల వైపు ఒక బృందం, నాగచైతన్య వైపు మరో వర్గం విడిపోయారు. నాగచైతన్యని స్టార్‌ని చేయడానికి నాగార్జున ఎక్కువ ఎఫర్ట్స్‌ పెట్టలేదని ప్రధాన ఆరోపణ. అఖిల్‌ని ఎలాగైనా స్టార్‌ని చేయడానికి నాగార్జున ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌ పెడుతున్నాడని, అదే నాగచైతన్యతో మాత్రం ద్వితీయ శ్రేణి దర్శకులతో మీడియం బడ్జెట్‌ సినిమాలు తీస్తున్నాడని చైతూ వర్గం ఆరోపిస్తోంది. ఆరోపణలతో సరిపెట్టకుండా ఈ వ్యవహారం ఇంకా ఇంకా ముదురుతోంది. ఒకరిని ఒకరు కించపరచుకుంటూ మీమ్‌లు, ట్రోల్‌ వీడియోలు కూడా సర్కులేట్‌ అవుతున్నాయి.

సాధారణంగా అవతలి హీరోల అభిమానులు ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ సొంత అభిమానులే కోపతాపాలతో రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని మొగ్గలోనే తుంచేయడానికి అక్కినేని బ్రదర్స్‌ ఏదైనా ప్రకటన చేస్తే మంచిదేమోనని పరిశీలకులు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు