ఎంత కష్టపడుతుందో చూశారా

ఎంత కష్టపడుతుందో చూశారా

అస‌లే సినిమాలు లేవు... సినిమాలు లేక‌పోతే మీడియా కూడా ప‌ట్టించుకోదు. మీడియా ప‌ట్టించుకోక‌పోతే లైమ్‌లైట్‌లో ఉండేదెలా? అందుకే పాపం మిల్కీ బ్యూటి త‌మ‌న్నా చాలా క‌ష్ట‌ప‌డుతోంది.

బాహుబ‌లి బ్యూటీ అనుకున్న‌వ‌న్నీ అడియాశ‌ల‌య్యాయి. బాహుబ‌లి సినిమాతో అవ‌కాశాలు వ‌చ్చిప‌డ‌తాయి అనుకుంది... కానీ జ‌ర‌గ‌లేదు. సీనియ‌ర్ హీరోయిన్ లిస్టులోకి చేర్చేసి... అవ‌కాశాలు త‌గ్గించేశారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. దీంతో తెలుగులో దాదాపు సినిమాలు లేకుండా పోయాయి. దీంతో తిరిగి అవకాశాలు చేజిక్కించుకునేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది అమ్మ‌డు. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా... ప్ర‌తి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వ్వ‌డం, అక్క‌డ ప్ర‌సంగాలు ఇవ్వ‌డం చేస్తోంద‌ట‌. అంతేకాదు అడ‌గ్గానే మీడియా వాళ్ల‌కి అందుబాటులో ఉంటోంద‌ట‌. చిన్న అవ‌కాశం వ‌చ్చినా వ‌ద‌లకుండా అల్లుకుపోతోంది.

తాజాగా త‌మ‌న్నాను పోతీస్ చీర‌ల వారు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంచుకున్నారు. ఫ్యాష‌న్ డిజైన‌ర్ నిష్కా లుల్లా చీర‌ల‌ను క‌ట్టుకుని ఫోటో షూట్‌, యాడ్‌లు చేసింది త‌మ‌న్నా. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో క‌బుర్లు చెప్పింది. ఇలా ప‌ట్టు చీర‌లు క‌ట్టుకుని రాయ‌ల్ గా క‌నిపించ‌డం త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, త‌న‌ను పోతీస్ వారు అందంగా తీర్చిదిద్దార‌ని మురిసిపోతూ చెబుతోంది. త‌మ‌న్నా క‌ష్టాన్ని చూసైనా ఎవ‌రైనా అవ‌కాశం ఇస్తారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు