పోయిన పేరు తిరిగొచ్చింది

పోయిన పేరు తిరిగొచ్చింది

ఐదేళ్ల కిందట రాసుకున్న కథ.. మూడేళ్ల కిందట ఓకే అయి.. రెండేళ్ల కిందట సెట్స్ మీదికి వెళ్లిన సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘భాగమతి’ శుక్రవారమే థియేటర్లలోకి దిగింది. అంచనాలకు తగ్గట్లు లేదన్న మాటలు వినిపించినా.. సినిమాకు నెగెటివ్ టాక్ అయితే రాలేదు. సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’ ఇచ్చిన షాక్‌తో దిమ్మదిదిరిగిపోయి ఉన్న ప్రేక్షకులకు ‘భాగమతి’ బాగానే అనిపిస్తోంది. సినిమాలో లోపాలంటూ చెప్పుకుంటూ వెళ్తే చాలానే కనిపిస్తాయి. ఐతే ‘భాగమతి’ ఎక్కడా బోర్ కొట్టించడం అయితే జరగలేదు. కొంచెం భిన్నంగా అనిపించే కథ.. మలుపులు.. అనుష్క నటన.. సాంకేతిక నిపుణుల అద్భుత పనితనం ‘భాగమతి’ని వాచబుల్ మూవీగా చేశాయి.

‘భాగమతి’ టీజర్.. ట్రైలర్ ఆసక్తి రేకెత్తించినప్పటికీ.. ఈ చిత్ర దర్శకుడి మీదే అందరికీ సందేహాలు నెలకొన్నాయి. ఒక కొరియన్ మూవీని కాపీ కొట్టి తీసిన ‘పిల్ల జమీందార్’ హిట్టయింది కానీ.. ఆ తర్వాత అతను చేసిన ‘సుకుమారుడు’.. ‘చిత్రాంగద’ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. అందులోనూ ‘చిత్రాంగద’ చూశాక అశోక్ ప్రతిభ మీద అందరికీ సందేహాలు కలిగాయి. ‘భాగమతి’ మొదలయ్యాక ఆ సినిమా రిలీజవ్వడంతో ఈ చిత్రం మీద కూడా భరోసా పోయేలా చేసిందది. ఐతే ‘భాగమతి’తో తనపై నెలకొన్న సందేహాలు తొలగించాడు అశోక్.

అతను గొప్ప సినిమా తీశాడని కాదు కానీ.. భిన్నమైన కథ రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ట్రై చేశాడు. మొత్తంగా దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. ‘భాగమతి’ డైరెక్టర్స్ మూవీ అనిపించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో అశోక్ కెరీర్ మళ్లీ గాడిన పడినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English