పవన్ కోసం 500 నోట్లు.. బాగా అతే

పవన్ కోసం 500 నోట్లు.. బాగా అతే

మిగ‌తా హీరోల అభిమానుల‌తో పోలిస్తే ... ప‌వ‌ర్ స్టార్ అభిమానులు కాస్త క్రేజీగా ఉంటారు. వారు ఏం చేసినా వెరైటీగా ఉంటుంది. వారి అభిమానం క‌ట్ట‌లు దాటుతుంది. దీనికి ఇదిగో ఇలాంటి సంఘ‌ట‌న‌లే ఉదాహ‌ర‌ణ‌లు. ఆల్రెడీ కటౌట్లకు పాలాభిషేకాలు అంటూ వేలకు వేలు వేస్టు చేసే ఫ్యాన్స్ నిజంగానే తమ దేవుడు ప్రజల్లోకి వచ్చాడంటూ ఓ రకమైన సంబరాలు జరుపుకుంటున్నారు.

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న రాజ‌కీయ యాత్ర ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా మొన్న ఖమ్మం జిల్లాకు వెళ్లారు. అక్క‌డ ఉండే రాజేష్ అనే యువ‌కుడు. ప‌వ‌న్‌కు వీరాభిమాని. ఎంత వీరాభిమాని  అంటే... తన అభిహాన హీరోపై కొత్త రెండు వంద‌లు, అయిదు వంద‌ల నోట్లు చ‌ల్లేంత‌. ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్ అయిపోయింది. ప‌వ‌న్ ను అభిమానించ‌డం వ‌ర‌కు ఓకే కానీ... మ‌రీ ఇంత‌లా... డ‌బ్బులు వెద‌జ‌ల్లేంత అభిమానం మాత్రం బాగా అతే అంటున్నారు చూసిన వాళ్లు.

ఇంత‌కీ అవి నిజమైన నోట్లేనా అని అనుమానించిన వాళ్లు ఉన్నారు. తెలిసిన స‌మాచారం వ‌ర‌కు మాత్రం అవి చెల్లుబాటులో ఉన్న కొత్త క‌రెన్సీనే. అభిమానుల ఆ రేంజులో అభిమానం పెంచుకోవ‌డం అంత మంచిది కాదంటున్నారు చాలా మంది. రోజుల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డితే సంపాదించ‌లేని డ‌బ్బును ఇలా  అభిమానం పేరుతో చ‌ల్ల‌డం మంచి ప‌ని కాద‌ని విమ‌ర్శిస్తున్న‌వారూ ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు