మహేష్.. తెలంగాణ ఫ్యాన్స్ ఫీలవ్వరా?

మహేష్.. తెలంగాణ ఫ్యాన్స్ ఫీలవ్వరా?

ఆంద్రప్రదేశ్ విభజన తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ సపరేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కొన్ని రూమర్స్ చాలా వచ్చినా ఆంధ్ర హీరోలు అని తెలంగాణ అభిమానులు ఏనాడు ఫీల్ అవ్వలేదు. తెలంగాణ లో హీరోలు ఎక్కువగా లేకపోయినప్పటికీ ఎప్పుడు ఆ టాపిక్ గురించి ఎవరు పట్టించుకోలేదు. పైగా చాలా మంది హీరోలకు తెలంగాణ లొనే మార్కెట్ ఎక్కువగా ఉంది. ఇక ఇప్పుడిపుడే తెలంగాణ భాషలో సినిమాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.

దీంతో స్టార్ హీరోలు కూడా తెలంగాణ బాషలో మాట్లాడుతూ వారిని ఖుషి చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి గా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ ఆంద్రప్రదేశ్ సీఎం గా కనిపిస్తాడాట. అంటే తెలంగాణ సైడ్ అభిమానులు ఫీల్ అవ్వరని అనుకున్నారా? ఎంతైనా అభిమానుల్లో కొంచెం స్థానికత అభిమానం ఉంటుంది. హీరోలు ఆ రూట్ లో డైలాగ్స్ చెప్తే వారిని కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు. కానీ మహేష్ కేవలం ఏపీ సీఎం అని చెబుతుంటే తెలంగాణ అభిమానులు కొంచెం ఫీల్ అయ్యే అవకాశం లేకపోలేదు. పైగా మనోళ్ళు రాష్ట్రం విడిపోకముందు జరిగే ఒక ఫిక్షనల్ కథ అంటున్నారు. అలా అయితే.. తెలంగాణ పోరును గుర్తించకుండా మహేష్‌ ముందుకెళ్ళాడు అనే అపవాదు కూడా ఎదర్కొనాల్సి వస్తుంది. ఇరు రాష్ట్రల ప్రజలను నిరాశపరచకుండా కొంచెం దర్శకుడు ఆలోచించి ఉంటే బావుండేదని టాక్ వినిపిస్తోంది.

రెండు రాష్ట్రాలు కలిసి ఉండేట్లు లేక మరో పేరు ఏదైనా ఆలోచించాల్సింది. ఉదాహరణకు తెలుగునాడు అని పెట్టాల్సింది అని ఓ వర్గం వారు చర్చించుకుంటున్నారు. మరి సినిమాలో కనీసం ఇతర అభిమానులు ఫీల్ అవ్వకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు