ప్రొడ్యూసర్ పవన్ కి హీరోలు ఎవరబ్బా

ప్రొడ్యూసర్ పవన్ కి హీరోలు ఎవరబ్బా

పవన్ కళ్యాణ్ హీరోగా కెరీర్ ముగించి ప్రొడ్యూసర్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. మరి పవర్ స్టార్ ప్రొడక్షన్ అంటేనే ఓ క్రేజ్ వచ్చేస్తుంది. మరి ఎవరిని హీరోలుగా పెట్టి పవన్ సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయనే చర్చలు తెగ నడిచేస్తున్నాయి.

నిజానికి ఇప్పటికే నితిన్ హీరోగా పవన్ నిర్మాతగా ఓ మూవీ నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం పవర్ స్టార్ బిజీగా ఉండడంతో.. మరో నిర్మాణ భాగస్వామి అయిన త్రివిక్రమ్ ద్వారా ఈ  పనులు చూసుకోవచ్చు. ఇక నిర్మాత పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాల గురించి చూస్తే.. రామ్ చరణ్ తో ఓ సినిమా తీస్తానని గతంలోనే పవన్ చెప్పుకొచ్చాడు. రాజకీయంగా బిజీగా ఉండే పవన్.. మరి ప్రొడ్యూసర్ గా ఎంత మేరకు ఉండగలడు అనే సందేహాలు సహజమే. ఈ పనులు కూడా రామ్ చరణ్ చూసుకుంటాడని అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ ను ఇప్పటికే నిర్వహిస్తున్న రామ్ చరణ్ అంటే.. పవన్ కు విపరీతమైన అభిమానం. అటు కొణిదెల బ్యానర్ తో పాటే.. ఇటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కు సంబంధించిన పనులను కూడా చెర్రీనే పర్యవేక్షిస్తాడని తెలుస్తోంది.

ప్రస్తుతం శంకర్.. సుకుమార్ క్రేజ్ ఉన్న దర్శకులు తాము నిర్మాతలుగా చిన్న సినిమాలను తీస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. పవన్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతాడని.. తనకు సన్నిహితులు అయిన యంగ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాకపోతే వీటి నిర్మాణ బాధ్యతలు కూడా కొణిదెల బ్యానర్ సైడ్ నుంచే ఉంటాయట. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు