ఆ కుర్చీయే ఆయన కోసం పుట్టింది

ఆ కుర్చీయే ఆయన కోసం పుట్టింది

యంగ్ హీరో నాగశౌర్య సోలో హీరోగా తాజాగా నటించిన ఛలో సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. రెండు రాష్ట్రాల బోర్డర్ లో జరిగే కథతో మంచి కామెడీ డైలాగులతో ఉన్న ట్రయిలర్ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. సినిమా మరింత బజ్ పెంచేందుకోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేశారు. దీనికి చీఫ్ గెస్ట్ గా మెగా స్టార్ చిరంజీవి హాజరు కావడంతో ఈ ఈవెంట్ కు అనుకున్న దానికన్నా గ్రాండ్ లుక్ వచ్చేసింది.

చిన్న హీరో అయినా తన సినిమా ఈవెంట్ కు మెగా స్టార్ రావడంతో నాగశౌర్య ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. మరో జన్మ ఉంటే మా అమ్మానాన్నలకే పుడతా.. మెగాస్టార్ అభిమానిగానే పుడతా అనే డైలాగుతో మెగా ఫ్యాన్స్ అందరితో ఈలలు వేయించాడు. ఈ సందర్భంగా తన మాటల్లో చిరంజీవిపై అభిమానాన్ని మొత్తం కుమ్మరించాడు. ‘‘నేను చాలాచాలా చిన్నవాడిని. ఆయన చెయ్యి నామీద పడింది. ఇది చాలు. పదేళ్లగా చిరంజీవి లేక ఆడియో ఫంక్షన్లను హోటళ్లలో చేసుకోవాల్సి వస్తోంది. మళ్లీ మెగాస్టార్ వచ్చారు. ఆడియో రిలీజ్ అంటే చూపించారు. మళ్లీ 100 రోజులు చూస్తాం. 175 రోజులూ చూస్తాం’’ అంటూ నాగశౌర్య తన ఆనందాన్ని ఎక్స్ ప్రెస్ చేశాడు.

‘‘ఇంతకుముందు చిరంజీవి గారు నటించే రోజుల్లో నెంబర్ 1 - 2 - 3 - 4 ఇలా నాలుగు కుర్చీలుండేవి. ఆయనెళ్లిపోయారు. ఇంకెవ్వరికీ కుర్చీల్లేవ్. అంతా నుంచేడమే. మళ్లీ ఆయనే వచ్చారు. ఆ కుర్చీ తనే తెచ్చున్నారు. ఆ కుర్చీలోకి ఎవరూ రారు. ఆ కుర్చీయే ఆయన కోసం పుట్టింది’’ అంటూ నాగశౌర్య తన మాటల్తో అభిమానులతో ఈలలేయించేశాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఛలో మూవీతో కన్నడ భామ రష్మిక మండన్న తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుందని.. మంచి నటి అంటూ నాగశౌర్య కితాబిచ్చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English