మళ్లీ ఆ దర్శకుడితో మంచు మనోజ్

మళ్లీ ఆ దర్శకుడితో మంచు మనోజ్

పోటుగాడు, కరెంటు తీగ లాంటి సినిమాలతో మంచు మనోజ్ కెరీర్ ఓ మోస్తరుగానే సాగిపోతూ వచ్చింది కొన్నేళ్ల కిందటి వరకు. కానీ మధ్యలో మనోజ్ వేసిన తప్పటడుగులు.. అతడి కెరీర్‌ను బాగా దెబ్బ తీసేశాయి. శౌర్య.. ఎటాక్.. గుంటూరోడు.. ఒక్కడు మిగిలాడు.. ఇవి ఒకదాన్ని మించి ఒకటి దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. ఇప్పుడు మనోజ్ కెరీరే ప్రశ్నార్థకంలో పడిపోయిన పరిస్థితి. మనోజ్ చివరి సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ అయితే వచ్చింది తెలియదు, వెళ్లింది తెలియదు. మనోజ్ కెరీర్లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో తర్వాతి ఏం సినిమా చేయాలా అని అయోమయంలో పడిపోయాడు మనోజ్.

వెంటనే సినిమా చేయకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నాడు మనోజ్. ఐతే ఈ మధ్యే మనోజ్‌కు ఒక విలక్షణ దర్శకుడు కథ వినిపించినట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. చంద్రశేఖర్ యేలేటి. ఇంతకుముందు మనోజ్‌తో అతను ‘ప్రయాణం’ అనే విభిన్నమైన సినిమా తీశాడు. దానికి మంచి పేరొచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. యేలేటి చివరగా తీసిన ‘మనసంతా’ పరిస్థితి కూడా అంతే. అందరూ మంచి సినిమా అన్నారు. అదీ ఆడలేదు. ఐతే ఈసారి కమర్షియల్‌గా క్లిక్కయ్యే ఓ విభిన్నమైన కథతో సినిమా చేయడానికి అతను రెడీ అవుతున్నాడు. మంచు ఫ్యామిలీ సొంత బేనర్లో మనోజ్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు