భాగమతి పేరుకు లింక్ ఏంటి?

భాగమతి పేరుకు లింక్ ఏంటి?

టాలీవుడ్ లో రేపు అసలు బాక్స్ ఆఫీస్ మజా మొదలవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్లోనే బిగ్గెస్ట్ చిత్రంగా రిలీజ్ అవుతోన్న భాగమతి కోసం ప్రస్తుతం సినిమా అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా సినిమా అరుంధతి రేంజ్ లో ఉంటుందని టాక్ మొదలైంది. అయితే సినిమా గురించి దర్శకుడు జీ.అశోక్ కుమార్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడాడు.

అసలు భాగమతి పేరు ప్రాముఖ్యత గలది.. హైదరాబాద్ రాజుకు చెందిన ప్రేయసి పేరు. అందుకే హైదరాబాదును భాగ్యనగరం అంటారు. మరి ఆ కథకూ పేరుకూ ఈ అనుష్క సినిమాకూ ఏదన్నా లింక్ ఉందా అని అడిగితే మాత్రం.. అశోక్ ఏమీ చెప్పలేదు. ''కథకి అలాగే ఆ పేరుకు గల సంబంధాన్ని తెరపైనే చూడాలి'' అంటూ ఆ విషయాన్ని దాచిపెట్టాడు.  ఇతర విషయాల గురించి మాట్లాడుతూ.. ''అందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. సినిమా షూటింగ్ చాలా వరకు ఆలస్యం అయినా కూడా మంచి అవుట్ ఫుట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఎక్కడా సినిమా బోర్ కొట్టదు. కథను నమ్మి సినిమాను తెరకెక్కించాను. కథనమే నా సినిమాకు బలం. అది ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వకుంటే నిరశ తప్పదు. కానీ ఆ విధంగా జరగకుండా జాగ్రత్తగా తప్పుల్ని సరిదిద్దుకొని సినిమాను తీశాము. యూవీ క్రియేషన్స్ ఎక్కడా తక్కకుండా సినిమాను నిర్మించారు'' అని సెలవిచ్చాడు.

అలాగే సినిమాలో పాత్రలతో పాటు తెరవెనుక కష్టపడిన సాంకేతిక నిపుణులు కూడా సినిమాలో పాత్రధారులే అంటున్నాడు. ముఖ్యమైన బంగ్లా కూడా ఒక పెద్ద క్యారక్టరే అని చెప్పాడు. ఇక అనుష్క పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువేనట. ఆమె తప్ప ఈ కథకు మరెవరు సెట్ కారేమో అని అన్నారు అశోక్. రేపు (జనవరి 26న) భాగమతి రిలీజ్ అవుతోంది. చూద్దాం ఎలా ఉండబోతుందో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English