ఇటు త‌ల్లి.. అటు హీరో.. మ‌ధ్య‌లో శివాని

ఇటు త‌ల్లి.. అటు హీరో.. మ‌ధ్య‌లో శివాని

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివాని తెరంగేట్రం కోసం అష్ట‌క‌ష్టాలు ప‌డింది. రెండేళ్ల క్రితం నుంచి ప్ర‌య‌త్నిస్తే ఇదిగో ఇప్ప‌టికి ఓ ప్రాజెక్టు కుదిరింది.  అడివి శేష్ తో తెర‌ను పంచుకోబోతోంది. 2 స్టేట్స్ రీమేక్లో నటిస్తోంది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ... ఇద్ద‌రు అత్యుత్సాహం ఉన్న వ్య‌క్తుల మ‌ధ్య‌లో శివాని ఏమవుతుందో, ఆమె సినిమా ఏమవుతుందోన‌ని సినీ జ‌నాలు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ఇంత‌కీ ఆ అత్యుత్సాహం ఉన్న వ్య‌క్తులు ఎవ‌రు? ఇంకెవ‌రు... శివాని త‌ల్లి జీవిత‌, హీరో అడివి శేష్‌. వీళ్లిద్ద‌రూ న‌టులే కాదు... ద‌ర్శ‌కులు కూడా. ద‌ర్శ‌క‌త్వంలో ఇద్ద‌రికీ కాస్త ట‌చ్ ఉంది. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య శివాని న‌లిగిపోవ‌డం ఖాయం అంటున్నారు ఫిల్మ్ న‌గ‌ర్ వాసులు. జీవిత‌కు సినిమా మేకింగ్ లో వేలు పెట్టే అల‌వాటు ఉందనేది ఎప్పుడూ వినిపించే రూమరే. ఇలా తీయండి, అలా తీయండి అంటూ స‌ల‌హాలు ఇచ్చేస్తుందట. ఇక అడివి శేష్ కు కూడా ఆ అల‌వాటు పుష్క‌లంగా ఉంది అనేది మరో టాక్. మేకింగ్లో వేలు పెట్ట‌కుండా ఉండ‌లేడట మనోడు. మరి వీరి మధ్యలో ఆ సినిమా ఎలా షేప్ అవుతుందో అనే సందేహం సహజంగానే వస్తోంది.

అస‌లే కొండంత ఆశ‌ల‌తో సినిమా కెరియ‌ర్ మొద‌లుపెడుతోంది శివాని. తొలి సినిమా హిట్ కొడితేనే రెండో సినిమాలో బుక్ అయ్యేది. లుక్స్‌లో అంతంత మాత్రంగా ఉన్న శివాని త‌న యాక్టింగ్‌తోనే అంద‌రినీ ఆకట్టుకోవాలి.  కానీ త‌ల్లి, హీరోల మ‌ధ్య ఆమె న‌లిగిపోయే అవకాశ‌మే ఎక్కువేమో అంటున్నారు సినీ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు