స్పైడర్ ఎందుకింతగా దిగజారిపోయాడు?

స్పైడర్ ఎందుకింతగా దిగజారిపోయాడు?

గతేడాది దసరా టైంలో రిలీజ్ అయిన మహేష్ బాబు మూవీ స్పైడర్. థియేటర్లలో ఈ సినిమా ఏ తరహాగా పెర్ఫామ్ చేసిందో తెలిసిందే. ఆడియన్స్ కాదు కదా.. అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం.. అప్పటివరకూ టాలీవుడ్ లో అతి పెద్ద డిజాస్టర్ అనిపించుకుంది. ఇప్పుడీ సినిమాను సంక్రాంతి సందర్భంగా టీవీల్లో టెలికాస్ట్ చేశారు.

పండుగల సమయంలో జనాలు ఇంట్లోనే ఉంటారు.. పైగా థియేటర్లలో ఆకట్టుకునే సినిమాలు లేవు.. అంతకుమించి మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ విపరీతంగా ఉంటుంది. ఇన్ని టెర్మ్స్ ను బేస్ చేసుకుని.. టీవీల్లో అయినా స్పైడర్ అదరగొడతాడని అనుకుంటే.. అక్కడ కూడా చతికిలపడిపోయిన ఈ సినిమా.. నిర్మలా కాన్వెంట్ వంటి చిన్న స్థాయి ఫ్లాప్ సినిమా కంటే తక్కువ టీఆర్పీలను పొందింది. ఇందుకు కారణం  జనాల నుంచి తిరస్కరణే అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇంతకీ స్పైడర్ ను మరీ ఇంత దారుణంగా తెలుగు ఆడియన్స్ ట్రీట్ చేయడానికి కారణం.. తమను మూవీ యూనిట్ చీట్ చేశారని భావించడమే అనే టాక్ వినిపిస్తోంది.

స్పైడర్ టీజర్ ఇచ్చినపుడు ఓ రోబో స్పైడర్ ను చూపి ఆకట్టుకుని.. తీరా సినిమాలో అలాంటిదేమీ లేదని అనేశారు. పోనీలే అనుకుని థియేటర్ కు వెళ్లిన వారికి.. స్పైడర్ లో ఎక్కడా స్పై కనిపించక వెతుక్కోవాల్సి వచ్చింది. టైటిల్ కి జస్టిఫికేషన్ చేయకపోతే సినిమా పరిస్థితి ఏంటో చెప్పడానికి ఈ సినిమాకి దక్కిన ఆదరణే ఉదాహరణ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు