మెగా ప్రేమ బాగానే ఉందిలే కాని..

మెగా ప్రేమ బాగానే ఉందిలే కాని..

నాగశౌర్య నటించిన చలో మూవీకి ప్రస్తుతం బజ్ బాగానే ఉంది. ప్రమోషనల్ వీడియోలు ఆకట్టుకోవడం.. పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. అయితే.. ఈ చిత్రానికి అన్నిటికి మించిన అదనపు ఆకర్షణగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ అటెండ్ కానుండడం నిలుస్తోంది.

చిరంజీవి అంతటి వ్యక్తి తమ చిన్న సినిమాను ప్రమోట్ చేయడానికి అంగీకరించడం.. స్వయంగా తమ ఈవెంట్ కు వచ్చేందుకు అంగీకరించడం వంటివి.. చలో యూనిట్  ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఆ ఆనందంలో బోలెడన్ని పోస్టర్లు వేసేసి మరీ.. మెగాస్టార్ కు కృతజ్ఞతలు చెప్పేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అసలు సమస్యంతా ఆ పోస్టర్ల దగ్గరే వస్తోంది. ఈ పోస్టర్లలో చిరంజీవిని ఉద్దేశించి 'పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి' అని రాసేస్తున్నారు. ఇది నిజమే అయినా.. పద్మ పురస్కారాలను ఇలా ప్రచారానికి వాడుకునే అవకాశం లేదు. ఈ మేరకు గతంలో కోర్టు నుంచి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు  చీవాట్లు కూడా పడ్డాయి.

అందుకే చిరంజీవి కూడా తన సినిమా ఖైదీ నంబర్ 150 ప్రమోషన్స్ లో ఎక్కడా ఆ బిరుదును ఉపయోగించలేదు. కానీ చలో టీంకు ఆ విషయంపై అవగాహన లోపించడంతో.. మెగా ప్రేమ కొద్దీ పద్మభూషణ్ అంటూ తెగ కీర్తించేస్తున్నారు. ఇది కాస్త ఎక్కువైతే ఈ సినిమా సంగతేమో కానీ.. చిరు చిక్కుల్లో పడతారు. కాస్త జాగ్రత్త సుమీ!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు