ఈ లెక్కన బోయపాటితో రచ్చేగా

ఈ లెక్కన బోయపాటితో రచ్చేగా

మెగా హీరో చెర్రీ మాస్ లుక్ ను రివీల్ చేస్తూ  రంగ‌స్థ‌లం టీజ‌ర్  విడుద‌లైంది. చిట్టిబాబు లుక్‌కి, ఆ గెడ్డానికి, ఆ న‌డ‌క‌కు, న‌ట‌న‌కు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. కేవ‌లం మాస్ లుక్‌ని చూసే మెగా అభిమానులు ఇలా ఊగిపోతుంటే... చ‌ర‌ణ్ బోయ‌పాటితో చేసే సినిమాలో ఇంకెలా ఉంటాడో.

రంగ‌స్థ‌లం టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. అందులోనూ హీరోహీరోయిన్లిద్ద‌రికీ శారీర‌క లోపాన్ని పెళ్లి సినిమా తీసిన‌ట్టు ఎప్ప‌టినుంచో వార్త‌లు వ‌చ్చాయి. టీజ‌ర్ ద్వారా చిట్టిబాబుకి సౌండ్ లేద‌ని తెలిసిపోయింది. ఆ టీజ‌ర్‌కు వ‌చ్చిన స్పంద‌న చూసి చెర్రీ ఉబ్బిత‌బ్బిబ‌యిపోతున్నాడు. త‌న ఫేస్ బుక్ పేజీలో ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. త‌న హోట‌ల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మ‌రీ కంగ్ర‌ట్స్ చెప్పిన గోదావ‌రి ప్ర‌జ‌ల‌కు ధ్యాంక్స్ అంటూ పోస్టు చేశాడు.  ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ రాజ‌మండ్రిలో షూటింగ్‌లో ఉన్నాడు. రంగ‌స్థ‌లానికి సంబంధించ కొన్ని సీన్ల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

రంగ‌స్థ‌లం త‌రువాత చ‌ర‌ణ్ బోయ‌పాటితో సినిమా చేయ‌నున్నారు. అస‌లే  మాస్ సినిమాల‌కు, యాక్ష‌న్ సీన్ల‌కు బోయ‌పాటి పెట్టింది పేరు.  ఆ సినిమాలో చెర్రీ ర‌చ్చ‌ర‌చ్చ చేయ‌డం ఖాయంలా క‌నిపిస్తోంది. మెగా మాస్ అభిమానుల‌కు ముందుంది పండ‌గ కాల‌మే.  ఈ మధ్యకాలంలో నెంబర్ల రేసులో చరణ్‌ బాగా వెనకబడిపోయాడు. ఎలాగో రాజమౌళితో మల్టీస్టారర్ వస్తున్నప్పటికీ.. ఇప్పుడు రంగస్థలం అండ్ బోయపాటి సినిమాలతో మనోడు మెగా సత్తా చాటేసే ఛాన్సుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు