కృష్ణవంశీ రెండు రోజులు అన్నం తినకుండా..

కృష్ణవంశీ రెండు రోజులు అన్నం తినకుండా..

సినీ పరిశ్రమలోకి ఎన్నో ఆశలతో వచ్చి ఇక్కడ ఎన్నెన్నో కష్టాలు పడి చాలా ఏళ్ల తర్వాత అవకాశాలు అందుకుని స్థిరపడుుతంటారు నటీనటులు, టెక్నీషియన్లు. ఆ అవకాశం అందుకునే వరకు ప్రతి రోజూ మనుగడ కష్టమే. ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్న ఎంతోమంది ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి కూడా కష్టపడ్డవాళ్లే.

అందులో క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ కూడా ఒకడంటున్నాడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. ఒక సందర్భంలో కృష్ణవంశీ రెండు రోజులు భోజనం లేక ఆకలితో బాధపడుతున్నపుడు తానే భోజనం పెట్టించినట్లు అతను ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమంలో వెల్లడించాడు.

‘‘కృష్ణవంశీకి ఆత్మాభిమానం ఎక్కువ. అతను పస్తులుంటాడు కానీ.. ఎవరినీ చేయి చాచి అడగడు. నేను ఇబ్బందుల్లో ఉన్నా అని కూడా చెప్పడు. అతడితో నాకు ఎప్పట్నుంచో స్నేహం ఉంది. ఒకసారి మేం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అప్పటికి సమయం రాత్రి ఎనిమిదిన్నర అయింది. నాకు ఆకలవుతోంది. నాకు అప్పుడు మెస్‌లో కార్డు ఉండేది. వంశీ.. రా భోంచేద్దాం అని తీసుకెళ్లా. అప్పుడే తెలిసింది అతను భోంజేసి రెండు రోజుల పైనే అయిందని. చాలా బాధేసింది. ఆ ఇబ్బందుల్లో ఇక ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నాడట. కానీ ఇంకో రోజు చూద్దాం అని వేచి చూస్తున్నాడట. అంతకుమించి వంశీకి నేనేమీ సాయం చేయలేదు. ఆ రోజు నేను అన్నం పెట్టించానన్న కృతజ్ఞతతో తన సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చాడు. ఐతే నాలో ప్రతిభ ఉంది కాబట్టి.. తన హీరో పాత్రకు సూటవుతానని అనుకున్నాను కాబట్టే నాతో సింధూరం సినిమా తీశాడు’’ అని బ్రహ్మాజీ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు