పిక్ టాక్: అన్నాచెల్లెళ్ల అనుబంధం

పిక్ టాక్: అన్నాచెల్లెళ్ల అనుబంధం

సోదర సోదరీమణులు అనే పదం రాజకీయాలలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. దాదాపుగా నేతల ప్రసంగాలన్నీ ఇక్కడే మొదలవుతాయి. అయితే ఓటర్లలో మాత్రమే కాకుండా నేతలలో కూడా అన్నా చెల్లెళ్లు కనిపిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ వారసుల్లో ఈ ట్రెండ్ గతంలోనే చూశాం. ఈ తరం రాజకీయ నాయకులలో అయితే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరు వారసులు రాజకీయాల్లో తమ ముద్ర చాటుతున్నారు.

తెలంగాణ ఐటీ మంత్రిగా కేటీఆర్.. లోక్ సభ సభ్యురాలిగా కవిత  సత్తా చాటుతున్నారు. ఈ తరంలోనే అగ్రనేతలుగా మారిన వీరు.. మరుసటి తరం నాటికి ఏ స్థాయికి చేరుకుంటారో ఊహించుకోవడం కష్టమేమీ కాదు. మరి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. చిన్నతనంలో అల్లరి మామూలుగానే ఉంటుంది. హైస్కూల్ చదువుతున్న నాటి కాలంలో కేటీఆర్.. ఎలిమెంటరీ స్కూల్ సమయంలో కవిత.. ఉన్న ఒక ఫోటో ఇప్పుడు వైరల్ ్వుతోంది.

టీషర్ట్.. జీన్స్ ప్యాంట్ తో ఉన్న చిన్న కేటీఆర్.. బుల్లి హీరో రేంజ్ లో ఉన్నాడు. కేటీఆర్ స్కూటర్ తోలుతున్నట్లుగా పోజ్ ఇస్తే.. ఆ స్కూటర్ ముందు నుంచి కవిత ఫోటోకు పోజ్ ఇచ్చిన తీరు చూడముచ్చటగా ఉంది. ఫోటో స్టూడియోలో దిగినట్లుగా కనిపిస్తూనే ఉండగా.. ఈ ఫోటో చూస్తే ఒక విషయం మాత్రం అర్ధమవుతుంది. వీరిద్దరి తండ్రి అయిన కేసీఆర్ కు గులాబి రంగు అంటే అప్పటి నుంచి ఎంత మక్కువో అనిపిస్తోంది కదూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు