మాస్ రాజా వచ్చేస్తున్నాడహో..

మాస్ రాజా వచ్చేస్తున్నాడహో..

ఈ శుక్రవారం మూణ్నాలుగు తెలుగు సినిమాలు విడుదల కావాల్సింది. కానీ చివరికి ‘భాగమతి’ ఒక్కటే మిగిలింది. ఆ తర్వాతి వారం సినిమాల సంగతి కూడా కొంచెం అయోమయంగానే ఉంది మొన్నటిదాకా. డిసెంబరు నెలాఖర్లోనే రావాల్సిన ‘ఛలో’ ఫిబ్రవరి 2కు వాయిదా పడగా.. దానికి పోటీగా ఇంకో రెండు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. వాటిలో ఒకటి ‘అ’. ఆ సినిమా ఇప్పుడే వచ్చే సంకేతాలేమీ కనిపించలేదు.

ఇక రవితేజ సినిమా ‘టచ్ చేసి చూడు’ సంగతే తేలాల్సి ఉండగా.. దాని విషయంలోనూ స్పష్టత వచ్చేసింది. ఈ చిత్రం అనుకున్నట్లే ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. బుధవారం ఈ చిత్రానికి సెన్సార్ కూడా పూర్తయింది. యు/ఎ సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు ‘టచ్ చేసి చూడు’కు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు.

సంక్రాంతి వచ్చిన పెద్ద సినిమాలు నిరాశకు గురి చేసిన నేపథ్యంలో తర్వాత రాబోయే స్టార్ సినిమా ‘టచ్ చేసి చూడు’ మీద ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి దాదాపు రెండేళ్ల విరామం తర్వాత గత ఏడాది ‘రాజా ది గ్రేట్’తో ప్రేక్షకుల్ని పలకరించిన మాస్ రాజాకు మంచి ఫలితమే దక్కింది. ఐతే ఆ చిత్రంలో అంధుడిగా నటించడంతో పూర్తి స్థాయిలో హీరోయిజం ఎలివేట్ కాలేదు.

‘టచ్ చేసి చూడు’ టీజర్ అదీ చూస్తే ఇందులో అందులో మాస్ ఎలిమెంట్స్‌కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది.‘విక్రమార్కుడు’.. ‘పవర్’ సినిమాల తర్వాత మాస్ రాజా మళ్లీ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర పోషిస్తున్నాడీ చిత్రంలో. వక్కంతం వంశీ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు