భాగమతి.. వాళ్లను భయపెడుతోందా?

భాగమతి.. వాళ్లను భయపెడుతోందా?

సంక్రాంతి సినిమాల సందడికి తెరపడింది. ఇక ఫోకస్ మొత్తం రిపబ్లిక్ డే వీకెండ్లో రాబోతున్న ‘భాగమతి’ మీదే ఉంది. దీనికి పోటీగా ఉన్న సినిమాలు రేసు నుంచి తప్పుకోవడం కలిసొచ్చే అంశమే. ఈ చిత్రం మొదలైనపుడు పెద్దగా అంచనాల్లేవు కానీ.. టీజర్, ట్రైలర్ చూశాక కథ మారింది. దీనికి హైప్ వచ్చింది. పబ్లిసిటీ కూడా కొంచెం గట్టిగా చేస్తూ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చే ప్రయత్నంలో ఉంది ‘యువి క్రియేషన్స్’ సంస్థ. రిలీజ్ కూడా స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఉండబోతోంది. మరి ఇన్ని చేస్తున్న సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యువి క్రియేషన్స్‌లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో మెజారిటీ విజయవంతమయ్యాయి. తక్కువ సమయంలో మంచి గుడ్ విల్ తెచ్చుకుందీ సంస్థ. తొలి సినిమా ‘మిర్చి’తో బడ్జెట్ విషయంలో కొంచెం శ్రుతి మించినప్పటికీ ప్రభాస్ స్టార్ ఇమేజ్ దానికి ప్లస్. పైగా సినిమాకు మంచి టాక్ వచ్చింది. అది బ్లాక్ బస్టర్ అయింది. కానీ ‘భాగమతి’ కథ వేరు. ఇందులో స్టార్ హీరో లేడు.
ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. కథను నమ్మి ఈ చిత్రానికి భారీగా ఖర్చు పెట్టేశారు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఒక బంగ్లా సెట్ కోసం రూ.3 కోట్లు ఖర్చు చేయడమంటే చిన్న విషయం కాదు. ఓవరాల్‌గా బడ్జెట్ రూ.30-35 కోట్ల దాకా ఉన్నట్లు చెబుతున్నారు. ఇది రికవర్ కావడం అంత ఈజీ కాదు.
 
అందుకే మాగ్జిమం థియేటర్లను ఈ సినిమా కోసం బుక్ చేసుకున్నారు. పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ ముంగిట హైప్ కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ‘అరుంధతి’.. ‘రుద్రమదేవి’ తరహాలో దీనికి భారీ ఓపెనింగ్స్ వచ్చి.. ఆ తర్వాత టాక్ కూడా బాగుంటేనే బడ్జెట్ రికవర్ అవుతుంది. మరి ఈ చిత్రానికి టాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ విషయంలో యువి క్రియేషన్స్ వాళ్లు బాగా టెన్షన్లో ఉన్నారని.. వాళ్ల బేనర్లో ఏ సినిమాకూ ఇలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. మరి ఈ శుక్రవారం ఏమవుతుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English