శర్వా-హను సినిమాకు వెరైటీ టైటిల్

శర్వా-హను సినిమాకు వెరైటీ టైటిల్

టాలీవుడ్‌లో మరో ఆసక్తికర కలయికలో సినిమా రాబోతోంది. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’.. ‘లై’ లాంటి భిన్నమైన సినిమాలు తీసిన హను రాఘవపూడి.. యువ కథానాయకుల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకుని, వరుస హిట్లతో స్టార్ ఇమేజ్ దిశగా అడుగులేస్తున్న శర్వానంద్ కలయికలో ఓ సినిమా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి అప్పుడే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. పడి పడి లేచే మనసు.. అంటూ ఒక సాఫ్ట్ టైటిల్‌ను ఈ సినిమా కోసం రిజిస్టర్ చేశారట. త్వరలోనే ఈ టైటిల్‌ను ప్రకటించబోతున్నట్లు తెలిసింది.

శర్వానంద్ సరసన సాయిపల్లవి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇదొక సాఫ్ట్ లవ్ స్టోరీ అని సమాచారం. ‘లై’తో యాక్షన్ థ్రిల్లర్ ట్రై చేసి ఫెయిలైన హను.. ఈసారి తన బలానికి తగ్గట్లుగా ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి అనే కొత్త నిర్మాతలు నిర్మిస్తున్నారు. హను రెండో సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు సంగీతాన్నందించిన విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ చేస్తున్నాడు. ‘రాధ’తో ఎదురు దెబ్బ తిన్న శర్వానంద్.. గత ఏడాది చివర్లో ‘మహానుభావుడు’తో మంచి విజయాన్నందుకుని ట్రాక్‌లో పడ్డాడు. శర్వా లాగే మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి అతడికి జోడీగా నటిస్తుండటంతో వీరి కలయిక ఆసక్తి రేకెత్తించేదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English