కడుపుతో నటించడం బాగా కష్టమే

కడుపుతో నటించడం బాగా కష్టమే

అవును హీరోయిన్ పూర్ణ‌కు డిఫ‌రెంట్ పాత్ర‌లు చేయ‌డమంటే ఇష్టం. అందుకోసం ఏమైనా చేస్తుంది. మొన్నామ‌ధ్య సినిమా కోసం గుండు కూడా కొట్టించేసుకుంది. తెలియ‌ని భాష నేర్చుకుని మ‌రీ డ‌బ్బింగ్ చెప్పేస్తుంది. సినిమాను ప్రేమించే ఈ పిల్ల‌కి ఇప్పుడో వెరైటీ రోల్ వ‌చ్చింది.

త‌మిళంలో పూర్ణ స‌వ‌ర‌క‌తి అనే సినిమాలో న‌టిస్తోంది. అందులో ఆమె చేసే పాత్ర పేరు సుభ‌ద్ర‌. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి. పైగా మ‌ళ్లీ గ‌ర్భ‌వ‌తి. అందులోనూ చెవిటి. ఎలాంటి గ్లామ‌ర్ డోస్ లేని సాదా సీదా ఇల్లాలి పాత్ర. దీనిని చేయ‌డానికి పూర్ణ చాలా క‌ష్ట‌ప‌డింద‌ట‌. అన్నింటికంటా గ‌ర్భ‌వ‌తిలా క‌నిపించ‌డం కోసం బెల్లీ బ్యాగ్‌ను క‌ట్టార‌ట పూర్ణ పొట్ట‌కి. దాని బ‌రువు అయిదు కిలోలు. దానిని మోస్తూ న‌టించ‌డం చాలా క‌ష్టంగా అనిపించింద‌ని చెబుతోంది పూర్ణ‌.

దాదాపు 32 రోజులు ఆ బ్యాగ్‌ను మోస్తూ షూటింగ్ లో పాల్గొంద‌ట‌. గ‌ర్భ‌వ‌తులు ఎలా కూర్చుంటారో, ఎలా నిల్చుంటారో వంటి సింపుల్ విష‌యాలు తెలుసుకోవ‌డానికి కూడా అధ్య‌య‌నం చేశాన‌ని చెబుతోంది. త‌న‌కు ముగ్గురు అక్క‌లు ఉన్నార‌ని... వారు ముగ్గురికి పిల్ల‌లు ఉన్నార‌ని చెబుతోంది. సో వాళ్ల‌నే అడిగి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో అడిగి తెలుసుకుంద‌ట‌. ఆ పాత్ర‌ను పండించ‌డం కోసం చాలానే క‌ష్ట ప‌డింది పూర్ణ‌.

పాపం పూర్ణ ఆ బెల్లీ బ్యాగ్‌ను మోస్తూ ప‌డే క‌ష్టాలు చూడ‌లేక‌... మొద‌ట పూర్ణ పాత్ర షూటింగే పూర్తి చేశార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. స‌వ‌ర‌క‌తిలో రామ్ అనే త‌మిళ హీరో న‌టిస్తుండ‌గా, జీఆర్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌రో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ మిస్కిన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ,తాను కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు