నాగ చైతన్యకి ఆ బ్రేక్‌ ఇదేనా?

నాగ చైతన్యకి ఆ బ్రేక్‌ ఇదేనా?

హీరోగా పరిచయమై పదేళ్లు కావస్తున్నా నాగచైతన్యకి స్టార్‌ స్టేటస్‌ రాలేదు. వరుస విజయాలతో మధ్య శ్రేణి హీరోగా స్థిరపడిన చైతన్య అక్కడ్నుంచి గ్రోత్‌ చూపించడం లేదు. నాని, శర్వానంద్‌ లాంటి హీరోలు ఎదిగిపోతూ వుంటే అంత బ్యాక్‌గ్రౌండ్‌ వుండీ చైతన్యకి పెద్ద బ్రేక్‌ రావడం లేదు. ప్రేమమ్‌, రారండోయ్‌ వేడుక చూద్దాం చిత్రాలు విజయవంతమయ్యాయి కానీ బ్లాక్‌బస్టర్‌ కాలేకపోయాయి. దీంతో చైతన్య స్టార్‌ అయ్యే ఆ సినిమా ఎప్పుడా అని అభిమానుల్లోను నిరాశా నిస్పృహలు అలముకున్నాయి.

అయితే సైలెంట్‌గా వస్తోన్న నాగచైతన్య తదుపరి చిత్రం సంచలనం అవుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య చేస్తోన్న సవ్యసాచిపై చాలా మంచి బజ్‌ వుంది. అర్జున్‌ రెడ్డి సినిమా మాదిరిగా ఇదో పెను సంచలనం కాగల అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఇందులో నటిస్తోన్న మాధవన్‌ కూడా సవ్యసాచి గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు. మహామహులతో పని చేసిన అనుభవం వున్న మాధవన్‌ ఈ చిత్రం గురించి ఇంతగా ఎక్సయిట్‌ అవుతూ వుండడం సవ్యసాచిపై బజ్‌ పెంచుతోంది. ఫలానా సినిమా పెద్ద బ్రేక్‌ అవుతుందంటూ ఎదురు చూసినవి అంచనాలని రీచ్‌ అవలేకపోయాయి. ఎలాంటి బజ్‌ లేకుండా మొదలైన సవ్యసాచి అంచనాలని మించిపోయి నాగచైతన్యని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లే చిత్రమవుతుందా? వేచి చూద్దాం మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు