బాలకృష్ణ చాలా సీరియస్‌గా తీసుకున్నాడు

బాలకృష్ణ చాలా సీరియస్‌గా తీసుకున్నాడు

ఎన్టీఆర్‌పై బయోపిక్‌ చిత్రాన్ని బాలకృష్ణ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి'లాంటి చారిత్రిక చిత్రం కోసం కూడా బాలకృష్ణ ప్రిపరేషన్‌ టైమ్‌ తీసుకోలేదు. ఉన్నపళంగా షూటింగ్‌ మొదలు పెట్టమని క్రిష్‌ని కంగారు పెట్టి షూటింగ్‌ ఉరుకులు పరుగుల మీద కానిచ్చేసారు. పని చేయడాన్ని ఇష్టపడే బాలయ్యకి ఖాళీగా కూర్చోవడం నచ్చదు.
మూడు నెలలు సమయం దొరికితే కొత్త సినిమా చేసేసే అలవాటున్న ఆయన బోయపాటి శ్రీనుకి కూడా వెయిటింగ్‌ టైమ్‌ ఇవ్వడం లేదు.

అయితే ఎన్టీఆర్‌ బయోపిక్‌ కోసం మాత్రం బాలకృష్ణ సమయం తీసుకుంటున్నారు. ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని, ఒక పెను సంచలనం సృష్టించగలదని, వచ్చే ఎన్నికలపై కూడా ప్రభావం చూపించే అవకాశం వుందని ఆయనకి బాగా తెలుసు. అందుకే తేజకి పూర్తి సమయాన్ని ఇవ్వడమే కాకుండా తాను కూడా అన్ని విషయాలపై హోమ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌కి వీలయినంత దగ్గరగా వుండేలా తన లుక్‌ని డిజైన్‌ చేయించడానికి విదేశీ మేకప్‌ నిపుణులని సంప్రదిస్తున్నారు. బయోపిక్‌ ముందు వేరే చిత్రం చేద్దామనే ఆలోచన మొదట్లో వున్నా కానీ ఇప్పుడు తన తదుపరి చిత్రంగా దీనినే చేద్దామని ఫిక్స్‌ అయ్యారు. బాలయ్య ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ చిత్రంపై నందమూరి అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక తేజ ఈ చిత్రాన్ని ఎంత గొప్పగా తీర్చి దిద్దుతాడనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు