అనుష్క ఇంత తేడా ఏంటండీ బాబూ..

అనుష్క ఇంత తేడా ఏంటండీ బాబూ..

హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు పారితోషకాలు తక్కువనే విషయంలో ఇప్పటికే చాలామంది కథానాయికలు గళమెత్తారు. ఇది అన్యాయం అన్నారు. కానీ సౌత్ ఇండియన్ సీనియర్, స్టార్ హీరోయిన్ అనుష్క మాత్రం హీరోలకు ఎక్కువ పారితోషకం ఇవ్వడం న్యాయమే అంటూ ప్రకటించి షాకిచ్చింది.  దానికే అందరూ ఆశ్చర్యపోతే.. ఇప్పుడు అనుష్క మరో భిన్నమైన వ్యాఖ్య చేసింది. సాధారణంగా హీరోయిన్లు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్..  లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేయాలనుందని అంటుంటారు. అలాంటివే తమకు ఎక్కువ సంతృప్తిని ఇస్తాయని అంటారు. కానీ అనుష్క మాత్రం దీనికి భిన్నమైన కామెంట్స్ చేసింది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రే మేలని ఆమె అంటోంది.

‘అరుంధతి’.. ‘రుద్రమదేవి’ లాంటి సినిమాలతో అనుష్క ఎంత మంచి పేరు సంపాదించిందో తెలిసిందే. ఇలాంటి పాత్రల్లో నటించాలనుందని మిగతా స్టార్ హీరోయిన్లు అంటుంటారు. ఐతే ఇలాంటి సినిమాలు చేయడం వల్ల అందరూ తనను హీరో హీరో అనడం మొదలుపెట్టారని.. అలాంటి సమయంలో ఇకపై ఇలాంటి పాత్రలు చేయొద్దని అనిపించిందని అనుష్క అంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని.. దాని బదులు కమర్షియల్ సినిమాలు చేస్తే నాలుగు పాటల్లో డ్యాన్స్ చేసి, కొన్ని సీన్లు చేసేస్తే తమ పనైపోతుందని.. మిగతాదంతా హీరోలు చూసుకుంటారని.. అప్పుడప్పుడూ ఇలాంటి పాత్రలే మేలని అనిపిస్తుంటుందని ఆమె అంది. ఐతే ‘అరుంధతి’.. ‘రుద్రమదేవి’.. ‘భాగమతి’ లాంటి సినిమాలు చేస్తే వచ్చే సంతృప్తి కూడా వేరని ఆమె అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు