ఆన్ స్క్రీన్ విలన్ తో జంటగా చూసేసింది

ఆన్ స్క్రీన్ విలన్ తో జంటగా చూసేసింది

పద్మావత్ మూవీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే అన్ని రకాల పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి అస్సలు ఏ మాత్రం ప్రమోషన్స్ చేయడం లేదు. అయితే.. గత రాత్రి మాత్రం ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది టీంతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సినిమా విషయంలో అసలు సిసలైన వివాదం.. అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రధారి అయిన రణవీర్ సింగ్- పద్మావతి పాత్రను పోషించిన దీపికా పదుకొనేల మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారనే. అయితే.. సినిమాలో వీరిద్దరూ విరోధుల పాత్రలను పోషించినా.. రియల్ లైఫ్ లో మాత్రం లవర్స్ అనే సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రణవీర్- దీపికలలో ఎవరూ పైకి చెప్పకపోయినా.. బహిరంగంగానే బోలెడంత కెమిస్ట్రీ పండించేస్తుంటారు. అలాంటి వీరిద్దరూ కలిసి పద్మావత్ మూవీ స్క్రీనింగ్ కి అటెండ్ అయ్యారు. సంప్రదాయ దుస్తులు ధరించిన వీరిద్దరు జంటగా చూడముచ్చటగా అలరించారు.

స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత చేతిలో చేయి వేసుకుని మరీ నడిచి బైటకు వచ్చి.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం అందుబోతున్నామనే ఆనందాన్ని కళ్లతోనే ప్రకటించారు రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే. షాహిద్ కపూర్ కూడా తన భార్యతో కలిసి ఈ సినిమా చూడగా.. దర్శక నిర్మాతలు స్క్రీనింగ్ తర్వాత భారీ టెన్షన్ నుంచి రిలీఫ్ అయినట్లుగా కనిపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English