అమీర్‌ను చూసి సల్మాన్ వాత?

అమీర్‌ను చూసి సల్మాన్ వాత?

ఇండియన్ సినిమా మార్కెట్ స్థాయిని ఎంతగానో పెంచిన హీరో అమీర్ ఖాన్. ఇండియాలో మిగతా హీరోలు చేరని మూలల్లోకి వెళ్లాడు. ఎవరూ అందుకోలేని ఎత్తుల్ని అందుకున్నాడు. కంటెంట్ మీద దృష్టిపెట్టి.. అతను అద్భుతమైన సినిమాల్ని అందించాడు. అవి అతడికి ఎనలేని పేరును, మార్కెట్‌ను తెచ్చిపెట్టాయి. ఇండియా అవతల కూడా అమీర్ ఖాన్ ఒక బ్రాండ్ వాల్యూ తెచ్చుకుని, అద్భుతమైన విజయాలు అందుకుంటున్నాడు. ఆల్రెడీ ‘దంగల్’ చైనాలో ఎలా ఇరగాడేసిందో తెలిసిందే. అతను ఓ కీలక పాత్ర పోషిస్తూ స్వయంగా నిర్మించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సైతం చైనాలో ప్రకంపనలు రేపుతోంది. ఐదు రోజుల్లో రూ.250 కోట్ల దాకా వసూలు చేసి దూసుకెళ్తోంది.

ఇండియాలో అమీర్‌కు దీటైన మార్కెట్ ఉన్న సల్మాన్ ఖాన్ సైతం ఇప్పుడు చైనా మార్కెట్ మీద కన్నేశాడు. అతను గత కొన్నేళ్లలో నటించిన మంచి సినిమాలు తీసి ఒక్కొక్కటిగా చైనాలో రిలీజ్ చేయబోతున్నారు. ముందుగా సల్మాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘భజరంగి భాయిజాన్’ను మార్చిలో చైనాలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఏకంగా 8 వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేస్తారట. ఇండియాలో రిలీజైన దాదాపు మూడేళ్లకు ఈ చిత్రం అక్కడికి వెళ్తోంది. ఆ తర్వాత ‘సుల్తాన్’ను కూడా రిలీజ్ చేస్తారట. ఐతే అమీర్‌ ‘త్రీ ఇడియట్స్’.. ‘పీకే’.. ‘దంగల్’ లాంటి సినిమాలతో నెమ్మదిగా మార్కెట్ పెంచుకున్నాడు. అతడికి అనుకోకుండా కలిసొచ్చింది. అదొక మ్యాజిక్ లాగా జరిగిపోయింది.

మరి సల్మాన్ విషయంలోనూ అలాగే జరుగుతుందని.. ఇతడి సినిమాలూ ఇరగాడేస్తాయని అనుకోవడానికి లేదు. ‘బాహుబలి’ని ఇలాగే భారీ స్థాయిలో విడుదల చేయబోతే వచ్చిన వసూళ్లు రిలీజ్ ఖర్చులకు కూడా సరిపోలేదు. మరి సల్మాన్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు