మళ్ళీ మాస్‌నే నమ్ముకున్న 'భాయ్‌'

మళ్ళీ మాస్‌నే నమ్ముకున్న 'భాయ్‌'

తన ఫేవరేట్‌ జానర్‌ రొమాన్స్‌ అయినా కూడా, మనోడు ఎందుకో ఈ మధ్య అలాంటి సబ్జెక్టులతో పెద్దగా హిట్టు కొట్టలేకపోతున్నాడు. వయస్సు మీదపడినా యంగ్‌ హీరోలా మెయిన్‌టైన్‌ చేసే హీరో కింగ్‌ నాగార్జున. వైవిద్యమైనా సినిమాలంటూ రాజన్నా, ఢమరుకం, సాయిబాబాలతో వరుసగా ఫ్లాపులు చవిచూశాడు.

ఇక రొమాంటిక్‌ యాంగిల్‌ అంటూ వచ్చిన గ్రీకువీరుడు కూడా చతికిలపడింది. అందుకే  ఇప్పుడు ఫోకసంతా ఫుల్‌ మాస్‌ మీదనే. త్వరలో రానున్న భాయ్‌ సినిమాలో నాగార్జున్‌ ఊర మాస్‌ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్‌ పూర్తవ్వడంతో, సినిమాను జులై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు.

ఇక గతంలో అహా నా పెళ్ళంట, పూలరంగడు సినిమాలతో సక్సెస్‌ కొట్టేసిన వీరభద్రమ్‌, భాయ్‌ సినిమాను కూడా అన్ని రకాల మాస్‌ ఎలిమెంట్స్‌తో అలానే రూపొందిస్తున్నాడట. ఒక దర్శకుడు, హీరో ఈ విధంగా మాస్‌ను నమ్ముకొని సినిమా చేస్తున్నారంటే, ఖచ్చితంగా ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పడతారని అంచనా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు