హిట్టు కూడా కొట్టు గోపీ!

హిట్టు కూడా కొట్టు గోపీ!

మాస్ హీరోగా బోలెడంత ఇమేజ్ ఉన్న గోపీచంద్.. చాలా కష్టపడి పైకి వచ్చాడు. హీరోగా పరిచయం అయినా.. విలన్ గా చేసేందుకు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఆ సమయంలో ఇంత డేరింగ్ చేసిన ఒకే ఒక్క టాలీవుడ్ హీరో అయిన గోపీచంద్ కు.. ఇప్పుడు కాలం అంతగా కలిసి రావడం లేదు. ఈ హీరో హిట్టు కొట్టి ఏళ్లు గడిచిపోయింది. కొన్ని సినిమాల రిలీజ్ కూడా కష్టం అయిపోయిందంటే గోపీచంద్ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సిట్యుయేషన్ ఏంటో తెలుస్తుంది.

అయితే ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్నా గోపీచంద్ కు ఆఫర్లు వరుసగానే వస్తున్నాయి. ప్రస్తుతం కొత్త దర్శకుడు చక్రి రూపొందిస్తున్న ఓ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు గోపీచంద్. కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మెహ్రీన్ ఈ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ హీరోతో పలువురు మేకర్స్ డిస్కషన్స్ చేస్తుండగా.. ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన వీరు పోట్లకు ఇప్పటికే కమిట్మెంట్ ఇవ్వగా.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

తమిళ్ దర్శకుడు తిరు రూపొందించే చిత్రానికి కూడా గోపీచంద్ సై అనేయడం విశేషం. అంటే ఒకేసారి మూడేసి సినిమాలు క్యూలో పెట్టేశాడన్న మాట. ఫ్లాపులు వేధిస్తున్నా ఒకేసారి ఇన్నేసి ఛాన్సులు అందుకోవడంలో సీక్రెట్ ఏంటో అంతుబట్టడం లేదు కానీ.. కనీసం ఒక హిట్టు అయినా కొట్టి గోపీచంద్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English