వెంకీ సినిమాకు నటీనటులు కావలెను

వెంకీ సినిమాకు నటీనటులు కావలెను

‘గురు’ సినిమా పూర్తి చేశాక దాదాపు ఏడాది పాటు విరామం తీసుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఈ మధ్యే అతను సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవం జరుపుకున్న నెల తర్వాత, ఇప్పుడు ఈ చిత్రానికి నటీనటులు కావాలంటూ ప్రకటన రావడం విశేషం. ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వివిధ వయసుల్లో ఉన్న కొత్త నటీనటులు కావాలంటూ ఈ చిత్ర నిర్మాణ సంస్థలు ప్రకటన ఇవ్వడం విశేషం.

దర్శకుడు తేజ ఇలా కొత్త నటీనటుల కోసం ప్రకటనలు ఇవ్వడం మామూలే. ఆయన కెరీర్లో ఇలా చాలా సినిమాలు కొత్త వాళ్లతో తెరకెక్కాయి. ఆయనే ఆడిషన్స్ చేసుకుని నటీనటుల్ని ఎంచుకున్నారు. ఆ సినిమాల్లో హీరో హీరోయిన్లు కూడా కొత్త వాళ్లే ఉండేవాళ్లు. ఆ సినిమాలకు బడ్జెట్ పరిమితులు ఉండటం కూడా ఇలా కొత్త వాళ్లతో ప్రయత్నించడానికి ఒక కారణం.
ఐతే విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరో.. సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నప్పటికీ కొత్త వాళ్ల కోసం ఇలా ప్రకటన ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ప్రారంభోత్సవం జరిగిన నెల తర్వాత ఆడిషన్స్ అంటే.. తాము అనుకున్న ఆర్టిస్టులతో వర్కవుట్ కాదనుకున్నారేమో. బడ్జెట్ తగ్గించడంలో భాగంగా కూడా ఇలా ట్రై చేస్తుండొచ్చు. ఈ చిత్రంలో వెంకీ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది కూడా ఇంకా ఖరారవ్వలేదు. ఐతే హీరోయిన్‌గా మాత్రం కొత్త అమ్మాయిని ట్రై చేయరని ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్నే తీసుకుంటారని అంటున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు