బ్లాక్ బస్టర్ రేంజిలో చెప్పుకుంటున్నారే..

బ్లాక్ బస్టర్ రేంజిలో చెప్పుకుంటున్నారే..

ఏదో సంక్రాంతికి వచ్చిన మిగతా సినిమాల నుంచి పోటీ లేకపోవడం వల్ల.. ముఖ్యంగా ‘అజ్ఞాతవాసి’కి దారుణమైన టాక్ రావడం వల్ల ‘జై సింహా’కు కలిసొచ్చింది. మాస్ సెంటర్లలో అసలు దీనికి పోటీ అన్నదే లేకపోవడంతో సోల్ లీడర్‌గా నిలిచి వసూళ్లు రాబట్టింది. నిజంగా సినిమా బాగుంటే ఇది ఫుల్ రన్లో 40-50 కోట్ల మధ్య షేర్ రాబట్టాలి.

కానీ ఈ చిత్రానికి ఇప్పటిదాకా వచ్చిన షేర్ రూ.26 కోట్లు మాత్రమే. గ్రాస్ కూడా 40 కోట్లు దాటిందంతే. కానీ ఈ చిత్ర బృందం మాత్రం తామేదో బ్లాక్ బస్టర్ కొట్టేసినట్లుగా ప్రచారం చేసుకుంటోంది. 50 కోట్ల గ్రాస్ వసూలైందంటూ పోస్టర్ల మీద వేసుకుని పబ్లిసిటీ చేసుకుంటోంది.

నిజానికి ‘జై సింహా’ అమ్మకాలు చాలా తక్కువ స్థాయిలో జరిగాయి. దీని థియేట్రికల్ రైట్స్ కేవలం రూ.27 కోట్లకే అమ్మారు. అయినప్పటికీ ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. రూ.25 కోట్ల షేర్ మార్కును దాటిందంతే. ఈ మాత్రానికే చిత్ర బృందం మాత్రం ఇదేద సెన్సేషనల్ హిట్టయినట్లు ఓ రేంజిలో ప్రచారం చేసుకుంటోంది.

దర్శకుడు కె.ఎస్.రవికుమార్ అయితే.. ఇది కేవలం మాస్ సినిమా అంటున్నారని.. అలా ఏమీ కాదని.. అన్ని సెంటర్లలోనూ ఇది అదరగొడుతోందని.. రూ.50 కోట్లు మాత్రమే కాదు.. త్వరలోనే రూ.100 కోట్ల మార్కును కూడా అందుకుంటుందని ప్రకటించడం విశేషం. తీసింది ఒక ఔట్ డేటెడ్ సినిమా. కాలం కలిసొచ్చి సినిమాకు పెట్టుబడి వెనక్కొచ్చేసరికి మరీ ఈ రేంజిలో చెప్పుకోవడం విడ్డూరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English