పీకే అడుగుజాడ‌ల్లో స‌ల్లూభాయ్‌

పీకే  అడుగుజాడ‌ల్లో స‌ల్లూభాయ్‌

పాకిస్తాన్ పాప భార‌త్‌లో త‌ప్పిపోవ‌డం, ఆమెను తిరిగి ఇంటికి చేర్చేందుకు బ‌జ‌రంగీ చేసిన సాహ‌స‌మే బ‌జ‌రంగీ భాయిజాన్ క‌ధ‌. ఆ సినిమా మూడేళ్ల క్రితం మ‌న‌దేశంలో విడుద‌లై క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. స‌ల్మాన్ ఖాన్ సినిమా చ‌రిత్ర‌లో మ‌రో పేజీగా మారింది. ఇప్పుడు త్వ‌ర‌లో ఆ సినిమా చైనా దేశంలో భారీగా విడుద‌ల‌వ్వ‌బోతోంది. దాదాపు 8000 స్క్రీన్ల‌పై ప్ర‌ద‌ర్శిత‌మ‌వ్వ‌బోతోంది.

ఇంత‌వ‌ర‌కు స‌ల్మాన్ ఖాన్ సినిమాలు చైనాలో విడుద‌ల‌వ్వ‌డం చాలా అరుదు. ఆ విష‌యంలో స‌ల్లూ భాయ్ దంగ‌ల్ స్టార్ అమీర్ ఖాన్ ను ఫాలో అవుతున్నాడు. అమీర్ ఖాన్ సినిమాలు దంగ‌ల్‌, పీకే, సీక్రెట్ సూప‌ర్ స్టార్ చైనాలో విడుద‌లై వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. అమీర్ ఖాన్ చైనాలో మంచి ఫాలోయింగ్‌ ఏర్ప‌డింది. సీక్రెట్ సూప‌ర్ స్టార్ సినిమా అయితే ఏకంగా 170కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసింది. అందుకే స‌ల్మాన్ కూడా త‌న కెరీర్‌లో సూప‌ర్ హిట్ సినిమా అయినా  బజ‌రంగీ భాయిజాన్‌ను చైనాలో విడుద‌ల చేసేందుకు సిద్ధం చేశాడు.

చైనా భాష‌లో భ‌జ‌రంగా భాయిజాన్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశాడు. చైనా వాళ్ల‌కి ఈ సినిమా ఎంత న‌చ్చుతుందో, ఏమాత్రం వ‌సూలు చేస్తుందో చూడాలి. క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా మ‌న‌దేశంలో ఆ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమాల‌లో ఒక‌టిగా నిలిచింది. చైనాలో కూడా అదే ప‌రిస్థితి రిపీట్ అవుతుందేమో చూడాలి. అక్క‌డ హ్యూమ‌న్ బీయింగ్ అంబాసిడ‌ర్ సూప‌ర్ స్టార్ గా మారి... చైనా హీరోల‌కు సైతం పోటీ ఇస్తాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు