ఫిల్మ్‌ఫేర్‌ రూటు మారిందేంటో?

ఫిల్మ్‌ఫేర్‌ రూటు మారిందేంటో?

ఫిల్మ్ ఫేర్ అవార్డులు ప్ర‌క‌టించ‌క ముందే ఉత్త‌మ న‌టుడెవ‌రో, ఉత్త‌మ న‌టెవ‌రో ముందే ఊహించేస్తారు బాలీవుడ్‌జ‌నాలు. గ‌త ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌ను గ‌మ‌నిస్తే విజేత‌ల‌ను ఊహించ‌డం ఎవ‌రికైనా సులువే. ఎప్పుడూ ఏ షారూఖ్‌ఖాన్‌కో, అమీర్ ఖాన్‌కో లేదా అనుష్క శ‌ర్మ‌కో, క‌త్రినా కైఫ్‌కో అవార్డులు వ‌స్తుంటాయి. త‌మ‌కు ఎవ‌రైతే ఫేవ‌ర్‌గా ఉంటారో వారినే ఆ ఏటి ఉత్త‌మ న‌టులుగా ఎంపిక చేస్తారు. ఈసారి మాత్రం ఫిల్మ్ ఫేర్ వారు ఎందుకో రూటు మార్చారు!!

63వ‌ జియో ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌లో ఉత్త‌మ న‌టుడిగా ఇర్ఫాన్ ఖాన్, ఉత్త‌మ న‌టిగా విద్యాబాల‌న్ ల‌ను ఎంపిక చేశారు. ఇది బాలీవుడ్ జ‌నాల‌నే కాదు... సామాన్య సినీజ‌నాల‌కు, స్టార్‌హీరోల అభిమానుల‌ను కూడా చిన్న‌పాటి షాక్‌కు గురి చేసింది. ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియం అనే సినిమాలో చేసిన న‌ట‌నకు మంచి మార్కులే ప‌డ్డాయి.  ఆ సినిమానే లెక్క‌లోకి తీసుకుని ఇర్ఫాన్ నుఎంపిక చేశారు. ఇక విద్యా బాల‌న్ న‌ట‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. న‌టించ‌మంటే, జీవించేస్తుంది. తుమ్హారి సులు సినిమాలోఆమె చేసిన పాత్ర సూప‌ర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా ఫిల్మ్‌ఫేర్ వాళ్ల‌కి ఎంతో ద‌గ్గ‌రైన షారూక్ ఖాన్ సినిమా రాయిస్‌ను కూడా కాద‌ని ఇర్ఫాన్ ఖాన్‌కు అవార్డు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌మే. జ‌గ్గాజాసూస్ క‌త్రినాను కాద‌ని విద్యాను ఉత్త‌మ న‌టిగా ఎంపిక చేయ‌డం వింతేమ‌రి.

ఫిల్మ్‌ఫేర్ వారిలో ఇంత మార్పుకు కార‌ణ‌మేంటీ అన్న‌దే ఇప్పుడు బాలీవుడ్ జ‌నాల్లో ఒక‌టే చ‌ర్చ‌. స్టార్‌హీరోలు, స్టార్‌హీరోయిన్ల‌ను కూడా  కాద‌ని ఇర్ఫాన్‌, విద్యాలను ఎందుకు ఎంపిక‌చేశార‌న్న దానిపై ఏవేవో గుస‌గుసలు విన‌బ‌డుతున్నాయి. వారిలో వ‌చ్చిన మార్పు ఈసారి కేనా? ఇక‌పై కూడా చిన్నాపెద్దా తేడా లేకుండా అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు