అడ్వాన్సులు ఇచ్చినవారి సంగతేంటి పీకే?

అడ్వాన్సులు ఇచ్చినవారి సంగతేంటి పీకే?

అజ్ఞాతవాసి పరాభవం దెబ్బ నుంచి పది రోజులు తిరగకుండానే పవన్‌ తేరుకోవడం అభిమానులకి ఊరటనిచ్చింది. రాజకీయ యాత్ర కూడా మొదలు పెట్టేసాడు కనుక అతని భవిష్యత్‌ ప్రణాళికపై వున్న అనుమానాలు తొలగిపోయాయి. రాజకీయ పరంగా పవన్‌ ఏమి చేయబోతున్నాడనే దానిపై స్పష్టత వస్తోంది కానీ సినిమాల పరంగా పవన్‌ తదుపరి స్టెప్‌ ఏంటనేది తెలియడం లేదు. పవన్‌కి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు ముగ్గురు ఇంకా అతని డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

అజ్ఞాతవాసి ఫ్లాప్‌ అవడంతో వెంటనే మరో సినిమా మొదలు పెడతాడని అనుకున్న పవన్‌ ఆ ఆలోచన లేదని రాజకీయ యాత్రతో తేల్చేసాడు. అలాగని అడ్వాన్సులు ఇచ్చిన వారికి కూడా వాటిని రిటర్న్‌ ఇవ్వలేదు. అంటే పవన్‌ మళ్లీ సినిమాలు చేస్తాడా? తదుపరి చిత్రం మొదలు పెట్టే ముందు ఈ యాత్ర మొదలు పెట్టాడా? ఎలాగో తన పార్టీ కేవలం కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తుందని ప్రకటించేసాడు కనుక మిగిలిన నాయకుల కంటే పవన్‌ దగ్గర ఖాళీ టైమ్‌ ఎక్కువే వుంటుంది. ఈ సమయాన్ని పార్టీని పటిష్టం చేసేందుకే వాడతాడో లేక నెలలో సగం రోజులు రాజకీయాలకి, సగం రోజులు సినిమాలకి కేటాయిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు