‘భాగమతి’కి రాసిచ్చేశారుగా..

‘భాగమతి’కి రాసిచ్చేశారుగా..

జనవరి 26న ‘భాగమతి సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించే సమయానికి దాంతో పాటు ఇంకో నాలుగు సినిమాలు అదే తేదీకి షెడ్యూల్ అయి ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇంత పోటీ మధ్య రిలీజ్ చేస్తే దాని పరిస్థితి ఏమిటా అని నిర్మాతల మీద జాలి పడ్డారు చాలామంది. కానీ ఇప్పుడు ‘భాగమతి’ అదృష్టం మామూలుగా లేదు.

దానికి పోటీగా రాబోయే వారాంతంలో ఒక్క తెలుగు సినిమా కూడా రావట్లేదు. ఆల్రెడీ ‘టచ్ చేసి చూడు’.. ‘అభిమన్యుడు’ సినిమాలు రిపబ్లిక్ డే వీకెండ్ నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. ఒక రోజు కిందటే కృష్ణ కూతురు మంజుల సినిమా ‘మనసుకు నచ్చింది’ని ఫిబ్రవరి 16కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వారాంతంలో రావాల్సిన ఒక పేరున్న సినిమా కూడా వాయిదా పడింది. అదే.. ‘ఆచారి అమెరికా యాత్ర’. ఏవో సాంకేతిక కారణాల వల్ల మంచు విష్ణు సినిమాను జనవరి 26 నుంచి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘ఆచారి అమెరికా యాత్ర’ లాంటి ఎంటర్టైనర్ రేసు నుంచి తప్పుకోవడం ‘భాగమతి’కి బాగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు. ఆల్రెడీ సంక్రాంతి సినిమాల జోరు తగ్గిపోయింది.

వాటి ప్రభావం ‘భాగమతి’గా పెద్దగా ఉండేలా కనిపించట్లేదు. ఇప్పుడు పోటీగా రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. ఒక్కడ డబ్బింగ్ సినిమా ‘పద్మావత్’ మాత్రమే రేసులో ఉంది. దాని వల్ల పెద్దగా ప్రమాదం లేకపోవచ్చేమో. మొత్తానికి అందరూ రేసు నుంచి తప్పుకుని ఈ వీకెండ్‌ను ‘భాగమతి’కి రాసిచ్చేశారనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English