ఆ హీరోయిన్ ను అందుకే వాడేస్తున్నారు

ఆ హీరోయిన్ ను అందుకే వాడేస్తున్నారు

స్టీరియోటైపింగ్ అనేది మన సినిమాల్లో తెగ జరుగుతుంటుంది. కొంతమంది హీరోయిన్లు గగ్గోలు పెడతారు కాని.. హీరోలైనా హీరోయిన్లయినా ఆ దాటికి తట్టుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే ఒకసారి ఒక నటీ లేదా నటుడ్ని ఒక పాత్రలో చూస్తే.. ఇక అందులోనే మళ్ళీ మళ్ళీ చూపిస్తుంటారు మనోళ్ళు. అదిగో ఇప్పుడు మనం అలాంటి విషయంలోనే హీరోయిన్ సీరత్ కపూర్ గురించి మాట్లాడుకోవాలి.

నిజానికి సైడ్ డ్యాన్సర్ గా బొంబాయిలో చాలా సినిమా పాటల్లో మెరిసిన సీరత్.. 'రన్ రాజా రన్' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. అయితే ఆ సినిమాలో కూడా హాటుగానే కనిపించింది కాని.. ఎందుకో బ్రేక్ రాలేదు. కాని తరువాత ట్విట్టర్లో తన బికినీ ఫోటో షూట్లను తెగ పోస్టుచేయగానే.. మనోళ్లు క్యూట కట్టేశారు. కట్ చేస్తే రాజు గారి గది 2 సినిమాలో చాలా హాటుగా బికినీలో కనిపించింది. ఇక ఒక్క క్షణం సినిమాలో హీరోయిన్ కాకపోయినా అమ్మడు చాలా సీన్లలో గ్లామరసం దారబోసింది. ఇప్పుడు టచ్ చేసి చూడు సినిమాలో రవితేజతో రొమాన్స్ చేయబోతోంది. ఈ సినిమాలో కూడా అమ్మడి గ్లామర్ కోషెంట్ ను తెగ వాడుకున్నారు అనడాకి.. అదిగో ఆ వర్కింగ్ స్టిల్స్ సాక్ష్యం అని చెప్పాలి.

అయితే ప్రతీ సినిమాలోనూ ఇలా కేవలం పొట్టి బట్టల్లో సీన్లను వేడెక్కించడానికి వాడటం ఎంతవరకు సబబు అంటున్నారు కొందరు సినిమా లవ్వర్స్. ఆమె ఎంత హాటుగా ఉన్నా కూడా.. మంచి పాత్రలను కూడా ఇవ్వొచ్చు. అలాగే ఇతర డ్రస్సింగ్ లో కూడా చూపెట్టవచ్చు. కాని ఓకే అనేసింది కదా అని ఇలా హాటు హాటుగా చూపిస్తూ పోతే.. ఏదో రోజూ తాప్సీ తరహాలో కోపగించుకుని పక్క వుడ్స్ కు వెళిపోయి.. తెలుగు ఇండస్ర్టీ వేస్ట్ అనేస్తుందేమో జాగ్రత్త!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు