ప్రభాస్ ఆయనతో చేస్తోంది అందుకేనా?

ప్రభాస్ ఆయనతో చేస్తోంది అందుకేనా?

ప్రస్తుతం బాలీవుడ్ - కోలీవుడ్ లోని ప్రముఖ మీడియా సంస్థలు ప్రభాస్ పై ఓ కన్నేసి ఉంచాయి. ఎప్పటికపుడు అతని ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటూ చిన్న పాయింట్ దొరికినా బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్నాయి. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మొత్తం నేషనల్ మార్కెట్ కి సాగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి పాత్రలో ప్రభాస్ ని చుసిన ప్రేక్షకులు స్టైలిష్ గా ఉండే రెబల్ స్టార్ ని కూడా చూడలని ఆశపడుతున్నారు.

ప్రభాస్ మొన్నటి వరకు తన ద్రుష్టి మొత్తం సాహో పైనే పెట్టాడు. అలాగే జిల్ దర్శకుడు రాధా కృష్ణ చెప్పిన రొమాంటిక్ లవ్ స్టోరీ హార్ట్ కి టచ్ అవ్వడంతో ఆ సినిమాను కూడా తొందరగా పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడు. కానీ ప్రభాస్ ఆ సినిమాను తన హోమ్ బ్యానర్ లో చేయాలనీ అనుకుంటున్నాడట. గోపి కృష్ణ ప్రొడక్షన్ లో ప్రభాస్ అప్పుడెప్పుడో బిల్లా సినిమా చేశాడు. మళ్లీ ఇంతవరకు ఏ సినిమాను చేయలేదు. ఆ మధ్యలో కృష్ణం రాజు ఒక్క అడుగు అనే సినిమాను ప్రభాస్ హీరోగా పెట్టి తీయాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఇక ఫైనల్ గా కృష్ణం రాజు కోసం రాధాకృష్ణ సినిమాను ఆ బ్యానర్లో చేస్తాడట.

అయితే ఈ సినిమాను కృష్ణం రాజు కోసం చేయడం వెనుక మరో విషయం ఉందంటున్నారు కొందరు సన్నిహితులు. కాస్త ఎక్కువ ఉదారత స్వభావం కలిగిన కృష్ణంరాజు.. డొనేషన్లంటే ముందే ఉంటారు. అలా ఆయన ఉన్నదంతా ఇచ్చేసి.. ఇప్పుడు కాస్త ఆర్ధికంగా సతమతమవుతున్నారట. అందుకే ఆయన్ను సేఫ్ జోన్లోకి తెచ్చేందుకే ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడనేది కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. కాని ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు