తమన్నా కొత్త స్టెప్పులు ఏం చేస్తాయో

తమన్నా కొత్త స్టెప్పులు ఏం చేస్తాయో

సౌత్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని కాపాడుకుంటూనే వస్తోంది. రెమ్యునరేషన్ లో హెచ్చు తగ్గులు అవుతున్నా కూడా మిల్కీ అందాలలో ఏ మాత్రం తేడా రావడం లేదు. ఇప్పటివరకు ఈ బ్యూటీ సౌత్ లో ఉన్న ప్రముఖ స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. దాదాపు టాలీవుడ్ లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో చిందులు వేసింది. అంతే కాకుండా సౌత్ లో ఉన్న హీరోయిన్స్ లలో తమన్నా లాగా స్పీడ్ స్టెప్పులు ఎవరు వేయరని చెప్పాలి.

అల్లు అర్జున్ ఎన్టీఆర్ డ్యాన్సులు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేద్దు. అయితే వారి సినిమాలో సెలెక్ట్ అయినా హీరోయిన్స్ ఆ హీరోల డ్యాన్స్ మూమెంట్ ని అందుకోవడానికి చాలా కష్టపడతారు. కానీ మిల్కీ బ్యూటీ మాత్రం చాలా ఈజీగా అందుకుంటుంది. ఇక అసలు విషయానికి వస్తే నెక్స్ట్ తమన్నా ఒక డిఫెరెంట్ డ్యాన్స్ తో రాబోతోంది. టాంగో స్టెప్పులు వేసి అందరిని మెప్పించాలని ట్రై చేస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న నా నువ్వే అనే సినిమాలో తమన్నా రేడియో జాకీగా కనిపించనుంది.

అయితే ఈ సినిమాలో టాంగో డ్యాన్స్ తో తమన్నా అలరించనుందట. ప్రస్తుతం ఆ స్టెప్పులనూ నేర్చుకుంటోందట. అయితే ఒకానొక సమయంలో ఆ డ్యాన్స్ స్టెప్పులు ట్రై చేసినపుడు గాయపడ్డాను అని చెబుతోంది. అయితే అది చేయడం అంత సులభం కాదు అని చెబుతూ కొరియోగ్రాఫర్ బృంద గారు చాలా బాగా తనకు కోచింగ్ ఇస్తున్నారని తమన్నా వివరించింది. మరి తమన్నా టాంగో స్టెప్పులు ఎలా ఉంటాయో చూడాలి.  అసలు ఈ స్టెప్పులతో ఆమె ఒక హిట్ కొడుతుందా అనేదే ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ కు కూడా అర్ధంకాని అంశం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు