ఎట్టకేలకు హిట్టు కొట్టాడబ్బా..

ఎట్టకేలకు హిట్టు కొట్టాడబ్బా..

సి.కళ్యాణ్.. ప్రస్తుత టాలీవుడ్లో అత్యంత సీనియర్ నిర్మాతల్లో ఒకరు. పేరుకేమో ఆయన పెద్ద నిర్మాత కూడా. కానీ సక్సెస్ రేట్ చూస్తే దారుణం. అంత రెగ్యులర్‌గా ఏమీ సినిమాలు తీయరు. తీసినా అవి ఆడటం అంతంతమాత్రమే. కళ్యాణ్ చివరగా తీసిన పెద్ద సినిమా ‘పరమ వీర చక్ర’. దాని ఫలితమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

మరో భారీ సినిమా ‘ఖలేజా’లోనూ ఆయన నిర్మాణ భాగస్వామి. అది కూడా తుస్సుమంది. ఇంకా గత దశాబ్ద కాలంలో ‘ఎటాక్’.. ‘జ్యోతిలక్ష్మీ’.. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’.. ‘ఆటాడిస్తా’ లాంటి సినిమాలు తీశారాయన. అన్నీ నిరాశపరిచినవే. చివరగా కళ్యాణ్ హిట్టు కొట్టింది ‘చందమామ’తో.

కళ్యాణ్ నుంచి చాన్నాళ్ల తర్వాత వచ్చిన పెద్ద సినిమా ‘జై సింహా’. ఈ సినిమా కాంబినేషన్.. దీని ప్రోమోలు చూసి ఇది కూడా ఆడటం కష్టమే అనుకున్నారంతా. అందుకు తగ్గట్లే ఈ సినిమాకు టాక్ కూడా ఏమంత బాగా లేదు. కానీ సంక్రాంతికి పోటీగా వచ్చిన మరో పెద్ద సినిమా ‘అజ్ఞాతవాసి’ తుస్సుమనిపించడం దీనికి కలిసొచ్చింది. ‘జై సింహా’ అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా ఉన్న ఈ సినిమా లాభాలు అందించేలా కూడా ఉంది. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తనే సొంతంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు సి.కళ్యాణ్.

అప్పుడు ఆయన మాటలు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించాయి. కానీ చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాల్లోంచి కొంత మొత్తం నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడిచే బసవతారకమ్మ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇస్తానని కూడా ప్రకటించారు కళ్యాణ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English