హీరోయిన్ లేకుండానే ప్రమోషన్లా??

హీరోయిన్ లేకుండానే ప్రమోషన్లా??

ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్.. కాకినాడ కైట్.. రాజమండ్రి గైట్.. ఇలా అన్నీ తిరిగేస్తూ ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న తన కొత్త సినిమా 'ఛలో'ను ప్రమోట్ చేస్తున్నాడు నాగ శౌర్య. అసలే ఈ మధ్యన హిట్టు కొట్టడం గగనం అయిపోతున్న పరిస్థితుల్లో మనోడు మాస్ హీరోగా ప్రూవ్ చేసుకుందాం అని తెగ తాపత్రాయపడుతున్నాడు. ఆ క్రమంలో గతంలో కొన్ని మాస్ సినిమాలు బెడసికొట్టాయ్ కాబట్టి ఇప్పుడు నాగ శౌర్య తెగ స్ర్టాంగ్ గా ప్రమోష్లు చేసుకుంటున్నాడు. బాగానే ఉంది.

అయితే ఇలా కాలేజీలు తిరిగి ప్రమోట్ చేయడం అనేది కొత్త కాదు కాని.. ఒక కొత్తమ్మాయ్ ని టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి ప్రమోట్ చేస్తే బాగుంటుంది కదా? ఈ సినిమాతో కన్నడ భామ రష్మిక మండన్నా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పుడు ప్రమోషన్లలో ఆ అమ్మాయి కనిపించట్లేదనే చాలామంది నిరాశ చెందుతున్నారు. ట్రైలర్లో కూడా ఆమె లుక్స్ బాగా ఇంప్రెస్ చేయడంతో.. ఆమె మీదనే అందరికీ ఆసక్తి ఎక్కువగా ఉండటం సహజమే. కాని చూస్తుంటే మొన్న చేసిన కామెంట్స్ ప్రకారం అసలు నాగ శౌర్య హీరోయిన్లకు పాపులార్టీ వస్తుందంటే.. వారితో కలసి ప్రమోషన్ కూడా చేసేలా లేడే అంటున్నారు జనాలు. ఎందుకంటే ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ.. ఫిదాలో సాయిపల్లవి కంటే వరుణ్‌ బాగా చేశాడని కాని క్రెడిట్ సాయిపల్లవికి ఇవ్వడం కరక్ట్ కాదు అన్నాడు. అంటే ఇప్పుడు కూడా ఈ సినిమాతో రష్మికకు క్రెడిట్ వచ్చేస్తుందేమో అని టెన్షన్ పడుతున్నాడా?

ఏదేమైనా కొత్త కుర్రాడు వెంకీ కుడుమల డైరక్షన్లో రూపొందుతున్న ఛలో సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. ఎందుకంటే ఈ సినిమాలో నాగ శౌర్య కూడా ఇన్వెస్ట్ చేశాడట. కాబట్టి ఛలో కు ఎంత గట్టిగా ప్రమోషన్లు చేస్తే అంత మంచిది. సర్లేండి.. కాలజీలు చుట్టూ తిరిగి నిఖల్ 'కేశవ' సినిమను తెగ ప్రమోట్ చేశాడు.. కాని కంటెంట్ వీక్ గా ఉంటే సినిమా ఆడదు కదా. సో చివర్లో కంటెంట్ కూడా ఉండాలి సుమీ!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు