చివరికి గెలిచింది కత్తేనా?

చివరికి గెలిచింది కత్తేనా?

మొత్తానికి కొన్ని నెలలుగా సాగుతున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. మహేష్ కత్తికి.. పవన్ కళ్యాన్ అభిమానులకు మధ్య ఎట్టకేలకు రాజీ కుదిరింది. మొన్న రాత్రి తనపై కోడి గుడ్లతో దాడి చేసిన ఇద్దరు పవన్ కళ్యాణ్ అభిమానుల మీద నిన్న ఉదయం కేసు పెట్టిన కత్తి.. రాత్రికల్లా యు టర్న్ తీసుకున్నాడు. ఒక టీవీ ఛానెల్లో చర్చకు వచ్చిన కత్తికి.. జనసేన తరఫున పనిచేసే ప్రతినిధికి మధ్య అక్కడే రాజీ కుదిరి అక్కడే ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విషయంలో న్యూస్ ప్రెజెంటర్ మూర్తి.. చర్చలో పాల్గొన్న ఒక సామాజిక వేత్త కూడా కీలక పాత్ర పోషించారు.

ఐతే ఈ చర్చ సాగిన తీరు.. అంతిమంగా కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం చూస్తే ఈ మొత్తం ఎపిసోడ్లో కత్తిదే పైచేయి అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ చర్చ మొదలైనపుడు మహేష్ కత్తి.. కొందరు మహిళలకు పంపిన అసభ్య మెసేజుల ప్రస్తావన వచ్చింది. ఐతే వాటి గురించే తాను మాట్లాడాల్సి వస్తే.. పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ వ్యవహారాలన్నీ బయటికి తీయాల్సి ఉంటుందని.. అర్ధరాత్రి దాటాక 3 గంటలకు తన భార్య నిద్రపోతుంటే ఎవరిని సాగనంపడానికి పవన్ కారేసుకుని బయటికి వస్తాడో తేలాలని.. గత ఏడాది కాలంలో పవన్ కోసం త్రివిక్రమ్ ఎంతమంది అమ్మాయిలతో సెటిల్మెంట్ చేశాడో చెప్పాలని.. త్రివిక్రమ్ కూడా లైన్లోకి రావాల్సి ఉంటుందని అన్నాడు కత్తి. దీంతో పవన్ మద్దతుదారుడిలో కొంచెం కంగారు మొదలైంది. అక్కడే స్వరం మారిపోయింది.

ఇదంతా ఎందుకు.. ఈ చర్చను ఇక్కడితో ఆపేద్దాం అనడం.. దయచేసి పవన్ అభిమానుల మీద కేసు వాపసు తీసుకోవాలని అభ్యర్థించడం.. పవన్ అభిమానులు ఇకపై మిమ్మల్ని ఏమీ అనరని.. ఆ విషయంలో అభిమానులందరికీ గట్టి హెచ్చరికలు వెళ్తాయని హామీ ఇవ్వడం.. కత్తి డిమాండ్ మేరకే జనసేన నుంచి నిన్న ప్రెస్ నోట్ విడుదలైందని కూడా చెప్పడం జరిగింది. ఇలా జనసేన ప్రతినిధి ప్లీజింగ్‌గా మాట్లాడటంతో కత్తి తగ్గాడు. కేసు వాపస్ తీసుకోవడానికి అంగీకరించాడు. అదే సమయంలో ఇంకో ఆర్నెల్ల పాటు పవన్ గురించి ఏమీ మాట్లాడకుండా ఉండాలన్న షరతును కత్తి అంగీకరించలేదు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లనని.. కానీ రాజకీయాలు, సినిమాల విషయంలో తన అభిప్రాయాలు ఇప్పట్లాగే నిర్మొహమాటంగా చెబుతానని తేల్చి చెప్పాడు కత్తి. ఆ తర్వాత ఆ టీవీ ఛానెల్ ప్రతినిధులు.. చర్చలో పాల్గొన్న వారితో కలిసి కత్తి పోలీస్ స్టేషన్‌కు కదిలాడు. కేసు వాపస్ తీసుకున్నాడు. మొత్తం వ్యవహారం గమనిస్తే కత్తిదే పైచేయి అని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English