టీవీ ఛానెల్లో పోర్న్ చూస్తూ వర్మ?

టీవీ ఛానెల్లో పోర్న్ చూస్తూ వర్మ?

రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా.. ఏం చేసినా సంచలనమే. రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఫెయిలవుతుండొచ్చు కానీ.. ఆయన మాత్రం ఎప్పుడూ ఫెయిలవ్వడు అన్నది ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ అభిప్రాయం. తన విలక్షణతను అభిమానించే వాళ్లను వర్మ ఎప్పుడూ నిరాశపరచడు. వాళ్లను ఎప్పుడూ అలరిస్తూ ఉంటాడు. కొన్నేళ్లుగా రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే కూడా ఆయన చేష్టలు.. మాటలు.. వివాదాలు.. వాదనల్ని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు.

తాజాగా వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ పేరుతో మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్‌ను పెట్టి ఒక చిన్న సినిమా తీయడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కొన్ని మహిళా సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. టీవీ ఛానెళ్ల చర్చల్లో వర్మతో వాగ్వాదానికి దిగారు. ఇలా ఒక ఛానెల్ చర్చలో భాగంగా వర్మ స్టూడియోలో కూర్చుని ఉండగా ఒక మహిళా నేత లైన్లోకి వచ్చింది. వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

ఐతే ఆమె తనను తిడుతున్న సమయంలో వర్మ అదేమీ పట్టించుకోకుండా తన పాటికి తాను ఫోన్ చూస్తూ కనిపించాడు. అది చూసిన న్యూస్ ప్రెజెంటర్.. ఆమె అలా మాట్లాడుతుంటే మీరు ఫోన్లో మునిగిపోయారేంటి.. పోర్న్ కానీ చూస్తున్నారా అని అడిగాడు. వెంటనే వర్మ.. ‘‘కరెక్ట్.. పర్ఫెక్ట్‌గా చెప్పారు. నేను పోర్నే చూస్తున్నా’’ అంటూ సీరియస్‌‌గా తనదైన శైలిలో బదులిచ్చాడు వర్మ. ఆ సమాధానంతో ఏం మాట్లాడాలో ఆ న్యూస్ ప్రెజెంటర్‌కు కానీ.. లైన్లో ఉన్న ఆ మహిళా నేతకు కానీ అర్థం కాలేదు. తాను ఉదయం లేవగానే పోర్న్ చూస్తానని..  దీంతో రోజంతా చాలా ఉత్సాహంగా పని చేస్తానని వర్మ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు