ప్రభాస్ కొత్త సినిమాపై క్లారిటీ

ప్రభాస్ కొత్త సినిమాపై క్లారిటీ

‘బాహుబలి’తో నేషనల్ లెవెల్లో సూపర్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబల్ ప్రభాస్. అతడి కెరీర్‌ను తెలుుగ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇతర భాషల వాళ్లు మాత్రం ఆసక్తిగా గమనిస్తున్నారిప్పుడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ మీద కోట్ల మంది కళ్లున్నాయి. ఆ తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో కూడా ఆసక్తి కనిపిస్తోంది. తాను ఓ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నట్లుగా ప్రభాస్ ఈ మధ్యే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మాత్రం ఈ విషయమై తనకు సమాచారం లేదన్నట్లుగా మాట్లాడుతుండటం విశేషం.

తనకు తెలిసి ప్రభాస్ తర్వాతి సినిమా తమ సొంత బేనర్ ‘గోపీకృష్ణ మూవీస్’లో ఉంటుందని కృష్ణం రాజు తెలిపారు. ఈ చిత్రం ఏప్రిల్లో సెట్స్ మీదికి వెళ్లబోతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ఆయన అన్నారు. ఒకవేళ ప్రభాస్ బాలీవుడ్ సినిమా చేసేట్లయితే ఈ సినిమాను వాయిదా వేస్తానని కృష్ణం రాజు అన్నారు. ఆయన మాటల్ని బట్టి చేస్తే ప్రభాస్ హిందీ సినిమాపై ఇంకా ఏ స్పష్టత లేనట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణం రాజు దగ్గర ప్రస్తావిస్తే.. కొంచెం అసహనంతో మాట్లాడారాయన. ఎప్పుడూ ఇదే ప్రశ్న తనకు ఎదురవుతోందని.. ఈ ఏడాది పెళ్లి చేద్దామని అనుకుంటున్నామని.. ఐతే ‘బాహుబలి’ అయ్యాక పెళ్లి చేసుకుంటా అని ఇంతకుముందు అన్న ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ తర్వాత అంటున్నాడని.. మరి ఆ సినిమా అయ్యాక ఏమంటాడో చూడాలని ఆయన అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు