సాయి పల్లవికి రాజు లేడు, రత్నం లేడు

సాయి పల్లవికి రాజు లేడు, రత్నం లేడు

మహేష్‌బాబుతో సినిమా అనో, రాజమౌళి దర్శకుడు అనో చెప్పగానే హీరోయిన్లు ఇంకేమీ ఆలోచించకుండా డేట్లు సర్దుబాటు చేసేస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం తనకి నచ్చిన వాళ్లు ఎవరున్నా సరే కథ, తన పాత్ర తనకి నచ్చడం అత్యవసరమని అంటోంది. కథ నచ్చకుండా తన పాత్రకి న్యాయం చేయలేనని, ఒక దర్శకుడు లేదా హీరోపై వున్న అభిమానంతో అవకాశాన్ని వదులుకోకుంటే త్వరగా కనుమరుగు అయిపోవాల్సి వస్తుందని అంటోంది.

సదరు హీరో లేదా దర్శకుడితో మళ్లీ పని చేసే అవకాశం వస్తుందని, కానీ ఇప్పుడు రాంగ్‌ స్టెప్స్‌ వేయడం వల్ల ఇది చేదు అనుభవంగా మిగిలిపోతుందని చెప్పింది. దిల్‌ రాజుతో వరుసగా రెండు సినిమాలు చేసిన సాయి పల్లవి అతనితో మరో చిత్రానికి నో చెప్పింది. అందుకు పెద్దగా కారణాలేం లేవని, తనకి కథ నచ్చలేదని తేల్చేసింది. అలాగే మణిరత్నం అంటే పడి చచ్చిపోయే సాయి పల్లవి అతనితో చిత్రానికి కూడా నో చెప్పింది.

కథ నచ్చనపుడు మణిరత్నం వున్నా కానీ తాను న్యాయం చేయలేనని అంది. విక్రమ్‌ సరసన నటించే అవకాశాన్ని వదులుకున్న సాయి పల్లవి అతని పక్కన బలమైన పాత్ర లేకపోతే తేలిపోతానని, దానికంటే అవకాశాన్ని వదులుకోవడమే మంచిదని చెప్పింది. దీని వల్ల తనకి అహంకారం, తల పొగరు అనే బిరుదులు ఇచ్చినా కానీ నష్టం లేదని అంటోంది. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు