అజ్ఞాతవాసి, స్పైడర్‌ దెబ్బకి బెంబేలు

అజ్ఞాతవాసి, స్పైడర్‌ దెబ్బకి బెంబేలు

పెద్ద హీరోల సినిమాలని, స్టార్‌ దర్శకులు వున్నారని ఒక చిత్రాన్ని ఎక్కువ అంచనా వేసి కొనేస్తే ఏమవుతుందనేది స్పైడర్‌, అజ్ఞాతవాసి చిత్రాలతో తెలిసి వచ్చింది. ఈ రెండు సినిమాలకి నూట ఇరవై కోట్లకి పైగా బిజినెస్‌ జరిగింది. కానీ రెండూ బయ్యర్లకి సగానికి పైగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో కాంబినేషన్లు చూసి సినిమాలు కొనడానికి బయ్యర్లు వెనకాడుతున్నారు. హిట్‌ అయితే ఎంత వస్తుందనేది వదిలేసి ఫ్లాప్‌ అయితే ఎంత పోతుందనే దానికి అనుగుణంగా బిజినెస్‌ లెక్కలు మాట్లాడాలని డిసైడ్‌ అయ్యారు.

సినిమా గురించి ఏమీ తెలియకుండా కేవలం కాంబినేషన్‌ని చూసి చేస్తోన్న ఈ వ్యాపారం జూదం మాదిరిగా అయిపోయింది. అందుకే రాబోయే భారీ చిత్రాలకి భారీ రేట్లు పలికే అవకాశం కనిపించడం లేదు. ఈ అనుభవాలని దృష్టిలో వుంచుకుని హీరోలు కూడా తమ సినిమాలని ఎక్కువ రేట్‌కి అమ్మడానికి అడ్డు చెబుతున్నారని కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

బిజినెస్‌ తగ్గిందంటే ఆటోమేటిగ్గా చాలా ఖర్చులు తగ్గుతాయి, దర్శకులు-హీరోల పారితోషికాలతో సహా. సినిమా విడుదలైన తర్వాత నష్టపోతే పారితోషికం తిరిగి ఇవ్వడం కంటే ముందే తగ్గించుకుని అందరికీ అందుబాటులో వుండేలా సినిమా చేయడం ఉత్తమమని హీరోలు కూడా గ్రహించారనే సంకేతాలు బలంగా అందుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు